మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచే

Wed,September 12, 2018 03:23 AM

-జిల్లాలో 21 రోజుల్లో 90 శాతం నిర్మాణాలు పూర్తికావాలి
-ఇప్పటి వరకు 29 శాతం మాత్రమే పూర్తికావడమేంటి ..?
-స్పెషల్ డ్రైవ్ చేపట్టండి
-ఎంపీడీవోలు సీరియస్‌గా తీసుకోవాలి
-లక్ష్యం సాధించిన వారికి అవార్డులు ఇప్పిస్తా..
-జిల్లా స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్లుయాలి
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 11 : అక్టోబర్ 2 వరకు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూ ర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపి పనిచేయాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి భవన్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్వచ్ఛ భారత్‌మిషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవోలు, ఈజీఎస్, ఎంపీవోలు, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా అధికారుల బృందం సభ్యులతో మాట్లాడారు. జిల్లాలో ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్న, అధికారులకు ప్రత్యేకంగా విధులను అప్పగించిన ఇంకా జిల్లాలో ఇప్పటి వరకు 29 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తికావడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అంకితభావంతో పనిచేస్తూ 29 శాతంగా మాత్రమే ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను 100 శాతం చేయాలన్నారు. 29 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తై డాటా ఎంట్రీ చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. ప్రభుత్వం తాజాగా అందించిన రూ.7.5కోట్లతో నిర్మాణంలోని వివిధ దశ ల్లో ఉన్న మరుగుదొడ్లతో పాటు నిర్మిత లక్ష్యం మేరకు మరుగుదొడ్లను నిర్మించి ఆన్‌లైన్ చేసి లక్ష్యంగా నిర్ణయించిన అక్టోబర్ 2 ఇంకా 21 రోజులు మాత్రమే ఉన్నందున ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా బృందాల సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి క్షేత్ర స్థాయి ఫీల్డ్ ఆఫీసర్లు తదితరులు సహకారంతో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. లక్ష్యాన్ని చేరిన వారికి అవార్డులు ఇప్పిస్తానని అన్నారు. కార్యక్రమంలో డీపీవో చంద్రమౌళి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంజీవరావు, స్వచ్ఛ భారత్ మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి దిలీప్, ఎస్‌బీఎం స్టేట్ హెచ్‌ఆర్ కన్సల్టెంట్ మునీందర్ తదితరులు పాల్గొన్నారు.

130
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles