గిరిజన ఆశ్రమ పాఠశాలలో జేసీ తనిఖీ


Wed,September 12, 2018 03:23 AM

అంబేద్కర్ సెంటర్/కృష్ణకాలనీ, సెప్టెంబర్ 11 : జిల్లా కేంద్రంలోని స్థానిక కృష్ణకాలనీలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను జేసీ కే స్వర్ణలత సోమవారం తనిఖీ చే శారు. సాయంకాలం భోజనాన్ని విద్యార్థులకు మెనూ ప్రకారం ఇవ్వడం లేదని వార్డెన్ పోరిక సుశీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో మొత్తం 240 మంది విద్యార్థినులు ఉండగా 195 మందికి మాత్రమే భోజనం తయారు చేశారు. మిగిలిన 45 మంది విద్యార్థులు జేసీ ముందే ఆహారం కోసం చూస్తుండడంపై జేసీ మండి పడ్డారు. ఈ సందర్భం గా తక్కువ వండిన వంటలపై డిప్యూటీ వార్డెన్ సుశీల పొంతన లేని సమాధానాలు చెప్పడంతో జేసీ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో నిర్లక్షంగా వ్యవహరించిన లాల్, సమ్మయ్య, విజయబాయిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్టోర్ రూం ను పరిశీలించగా కూరగాయలు, వంట సామగ్రి లేకపోవడంతో వార్డెన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఏ వస్తువు లేకుండా, పిల్లలకు భోజనం ఎలా పెడుతున్నారని వార్డెన్ ప్రశ్నించారు. తను మళ్లీ తనిఖీ వస్తానన్నారు. అప్పుడు ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలని వార్డెన్ ఆదేశించారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...