అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

Wed,September 12, 2018 03:23 AM

గణపురం, సెప్టెంబర్ 11 : అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం మండలంలోని మై లారం గ్రామంలో పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర సా యంత్రం 8.30 గంటల ప్రాంతంలో ప్రధాన రోడ్డు నుంచి మొదలై ఎస్సీ కాలనీ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ పాదయాత్రలో స్పీకర్‌కు ప్రజలు మంగళహారతులు, కోలాటాలతో ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని చూసిన స్పీకర్ వారినుద్దేశించి మాట్లాడారు. నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి అంత ప్రజల కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి కేవలం నాలుగేళ్లలోనే చేశామని గుర్తుచేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చి ఇబ్బందులు లే కుండా చేశామన్నారు. నేడు గ్రామాల్లో సైతం 24 గంటల కరెంటుతో ప్రజల ఇబ్బందులు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముభారక్, ఆసరా ఫించన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రజలకుఎంతగానో ఉపయోగపతున్నాయని అన్నారు. గ్రామంలో 69 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, రూ.24 లక్షలతో కుంటను పునరుద్ధరించడంతోపాటు మంచినీటి ట్యాంకులను నిర్మించినట్లు తెలిపారు. అంతే కాకుండా 50 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మైలారం సమీపంలోని బొర్రాకేవ్స్‌ను తలపించే సున్నపు గుహలను రానున్న రోజుల్లో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పల్లెల సర్వతోముఖాభివృద్ధికినిరంతరం కృషి చేస్తున్న తనను రాబోవు రోజుల్లో ఆశీర్వదించాలని కోరారు. అనంతరం గ్రామంలోని చెంచుకులస్తుడైన ఇండ్ల సాంబయ్య ఇంట్లో స్పీకర్ రాత్రి బస చేశారు. అక్కడే గ్రామస్తులతో కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. తొలుత నియోజకవర్గ వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు,నాయకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌజింగ్ ఫెడరేషన్ చైర్మన్ నవనీతరావు, జెడ్పీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్,టీ ఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దివి ప్రసాద్‌నాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాలఅధ్యక్షులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles