మాజీ ఎమ్మెల్యే గండ్రపై కేసు నమోదు

Wed,September 12, 2018 03:21 AM

-తుపాకీతో బెదిరించాడని క్రషర్ నిర్వాహకుడి ఫిర్యాదు
-మరో క్రషర్ నిర్వాహకుడు రవీందర్‌రావుపైనా కేసు
శాయంపేట, సెప్టెంబర్ 11 : భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు అతని సోదరుడు భూపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజబాబు మంగళవారం తెలిపారు. తుపాకీతో బెదిరించాడని వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు చెప్పారు. అలాగే క్రషర్ నిర్వాహకుడు ఎర్రబెల్లి రవీందర్‌రావుపైన కూడా తుపాకీతో బెదిరించాడన్న ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు చెప్పారు. ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శాయంపేట మండలం మాందారిపేట శివారులోని గుట్టల్లో రమణారెడ్డి సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్‌రావులు కలిసి క్వారీ, క్రషర్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇటీవల విడిపోయి అదే చోట వేర్వేరుగా క్రషర్లను నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే తన క్రషర్లలోకి రావద్దని మాదేనని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు అతని తమ్ముడు భూపాల్‌రెడ్డిలు సోమవారం రాత్రి తనను తుపాకీతో చంపుతామని బెదిరించారని ఎర్రబెల్లి రవీందర్‌రావు మంగళవారం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో ఆయుధ చట్టం ప్రకారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డిపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అలాగే భూపాల్‌రెడ్డి క్రషర్‌కు చెందిన సూపర్‌వైజర్ పరుపాటి గోవర్ధన్‌రెడ్డిని ఇక్కడ పనిచేయవద్దన ఎర్రబెల్లి రవీందర్‌రావు తుపాకీతో బెదిరించినట్లు తెలిపారు. ఈ మేరకు రవీందర్‌రావుపై గోవర్ధన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆయుధ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్ల చెప్పారు. క్రషర్ నేపథ్యంలో జరుగుతున్న గొడవలతో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకోవడంతో ముగ్గురిపై కేసు నమోదైనట్లు ఎస్సై వెల్లడించారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles