నైన్‌పాకలో ట్రాన్స్‌ఫార్మర్ సామగ్రి చోరీ


Wed,September 12, 2018 03:21 AM

టేకుమట్ల, సెప్టెంబర్ 11 : చిట్యాల మండలం నైన్‌పాక గ్రామానికి ఎత్తిపోతల పథకం కింద మంజూరైన ట్రాన్స్ ఫార్మర్ సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి అపహరించినట్లు ఆ గ్రామ హనుమాన్ ఎత్తిపోతల పథకం ఆయకట్టుదారుల ఆభివృద్ధి సంఘం అధ్యక్షకార్యదర్శులు బొట్ల మొగిళి, ఎండీ. రజ్జబెల్లి తెలిపారు. ఈ మేరకు వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ రోజు లాగే సోమవారం తమ పంటపొలాలకు నీరు పెట్టుకుని ఇంటికి వచ్చి, మంగళవారం ఉదయమే వెళ్లి మోటర్లు వే యగా నడవలేదు. దీంతో రైతులు అంత ట్రాన్స్‌పార్మర్ వద్దకు వెళ్లి చూడ గా వైర్లు కట్ చేసి, ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్, అల్యూమినియం తదితర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. చోరీకి గురైన సామగ్రి విలువ రూ.3లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. అలాగే గతంలో ఒడితల, గిద్దెముత్తారంలో కూడా ఇదే విధంగా చోరీ జరిగిందని, ఆ దొంగలే ఇప్పుడు ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని, వెంటనే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...