సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత


Wed,September 12, 2018 03:21 AM

మహాముత్తారం, సెప్టెంబర్ 11 : మండలంలోని మాదారం గ్రామానికి చెందిన కొత్తపల్లి పోచక్కకు రూ.48,000 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం మహాముత్తారం జెడ్పీటీసీ మందల రాజిరెడ్డి, ఎంపీపీ మెండా వెంకటస్వామి, సింగిల్‌విండో చైర్మన్ లక్కిరెడ్డి నర్సింహరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్‌ల ఆధ్వర్యంలో బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా పోచక్క మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడిన తాము దవాఖానలో పెద్దమొత్తంలో ఖర్చు చేశామని, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్న మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, సహకరించిన జెడ్పీటీసీ మందల రాజిరెడ్డి, ఎంపీపీ మెండా వెంకటస్వామి, సింగిల్‌విండో చైర్మన్ లక్కిరెడ్డి నర్సింహరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు వెలమరెడ్డి అనిల్‌రెడ్డి, కొర్లకుంట గ్రామశాఖ అధ్యక్షుడు ముక్కెర నవీన్, దాసరి జంగు, నర్సింగాపూర్ రైతు కన్వీనర్ లకా్ష్మరెడ్డి, రాయమల్లు, కిచ్చయ్య, కల్వచర్ల రాజు, బీసులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...