ఎలక్షన్స్ స్సీడ్!

Tue,September 11, 2018 02:11 AM

-ఓటరు జాబితా ముసాయిదా విడుదల
-బూత్ స్థాయి ఎన్నికల సిబ్బందికి అవగాహన
-కలెక్టర్, ఎస్పీతో సీఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
-జిల్లా కేంద్రంలో రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
-కొత్త ప్రతిపాదనపై అంబేద్కర్ స్టేడియం, హాల్ పరిశీలన
-రేపు కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర బృందం సమావేశం
-అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా వెల్లడి
-అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో అధికారులు బిజీ
శాసనసభ ఎన్నికల ప్రక్రియ స్పీడందుకుంది. అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. నవంబర్‌లోనే ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశముండడంతో పనుల్లో వేగం పెంచారు. సోమవారం ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేశారు. ైక్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం అక్టోబర్ 8న తుది జాబితా వెల్లడించనున్నారు. సాయంత్రం ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్, అదనపు ఎస్పీ రాజమహేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. సమర్థులైన వారిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు(ఏఆర్వో)గా నియమించాలని సీఎస్ జోషి కలెక్టర్‌కు సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారితో సమన్వయంతో ఉంటూ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని డీజీపీ ఎస్పీకి చెప్పారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియాన్ని సందర్శించారు. ఈవీఎంలు భద్రపర్చడానికి స్ట్రాంగ్ రూం ఏర్పాటు, ఓట్ల లెక్కింపు నిర్వహణకు అనుకూలత, ప్రతికూలతపై సంయుక్తంగా పరిశీలించారు.

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ): శాసనసభ ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నవంబ ర్‌లోనే ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లలో వేగం పెంచారు. సోమవారం ఓటరు జాబితా ము సాయిదా విడుదల చేశారు. బూత్ స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తప్పులకు తావులేకుండా ఓటరు జాబితాను తయారు చేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు చెప్పారు. శాస నసభ ఎన్నికలు సమర్థ్ధవంతంగా నిర్వహించాలని అన్నారు. సా యంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మ హేందర్‌రెడ్డి ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. జిల్లా నుంచి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్ భాస్కరన్, అదనపు ఎస్పీ రాజమహేంద్రనాయక్ త దితరులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. సమర్థులైన అ ధికారుల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారు(ఆర్‌వో)లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు(ఏఆర్‌వో)లను ఎంపిక చేయాలని సీఎస్ ఎస్‌కే జోషి జిల్లా కలెక్టర్‌కు సూచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారితో సమన్వయంగా ఉంటూ ప్రశాంతంగా ఎన్నికలు ని ర్వహించాలని ఎస్పీకి చెప్పారు. రెవెన్యూ, పోలీసుశాఖ అధికా రులు సంయుక్త తనిఖీలు జరిపి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ఈవీఎంల భద్రతకు చర్యలు చేపట్టాలని అ న్నారు. సాధారణ, సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను గు ర్తించి అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని డీ జీపీ తెలిపారు.

ఎన్నికల నిర్వహణపై బుధవారం హైదరాబాద్ లో కేంద్ర బృందం నిర్వహించే సమావేశానికి జిల్లా నుంచి క లెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ హాజరుకానున్నారు. సోమ వారం సాయంత్రం సీఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీ భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడి యం సందర్శించారు. ఈవీఎంలు భద్రపర్చడానికి, స్ట్రాంగ్ రూం ఏర్పాటు, ఓట్ల లెక్కింపు నిర్వహణకు అనుకూలత, ప్ర తికూలతపై ఈ స్టేడియంలోని అంబేద్కర్ మినీహాల్‌ను సం యుక్తంగా పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు స్థానిక తహసీల్దార్ సత్యనారాయణస్వామితో కలిసి అం బేద్కర్ స్టేడియం, మినీహాల్‌ను సందర్శించారు. ఎన్నికల ఓట రు జాబితా తయారీపై భూపాలపల్లి, ములుగు శాసనసభా ని యోజకవర్గాల బూత్ స్థాయి అధికారులు, సిబ్బందికి వేర్వేరు గా నియోజకవర్గ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు జరి గాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బూత్‌స్థాయి ఎన్నికల అ ధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...ఇంటింటికి వెళ్లి ఓటరు జా బితా ప్రకారం ఓటర్లు ఉన్నది, లేనిది సరిచూసుకోవాలని చెప్పా రు. చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, ఇతర ప్రాంతాల నుంచి శాశ్వతంగా నివసించడానికి వచ్చిన ఓటర్ల వివరాలను, 1-1-2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారి వివరా లను జాగ్రత్తగా సేకరించాలని అన్నారు. ఎన్నికల సంఘం సూ చించిన తేదీల ప్రకారం నూతన ఓటరు నమోదుకు, ఓటరు జా బితాను సరిచేయటానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ములు గులో జరిగిన బూత్‌స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఆర్డీవో రమాదేవి, ఎన్నికల ఓటరు జాబితా తయారీపై సూచనలు చేశారు.

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles