భూపాలపల్లిలో లెక్కింపు.. !

Tue,September 11, 2018 02:10 AM

ములుగు, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాల ఎన్నిక ల ప్రక్రియను భూపాలపల్లి కేంద్రంగా నిర్వహించే ప్రతిపా దనను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈవీఎంలు భద్రపర్చ టంతో పాటు స్ట్రాంగ్‌రూం ఏర్పాటు, భూపాలపల్లి, ములుగు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహణకు అనుకూలత, ప్రతికూలతపై కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియం సందర్శించి ఇక్కడ ఉన్న అంబేద్కర్ మినీ హాల్‌ను పరిశీలిం చారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వరంగల్ మహానగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆవర ణలోని గోడౌన్‌లలో లేదా నిట్ క్యాంపస్ లో జరిగింది. జిల్లాల పునర్విభజనతో 2016 అక్టోబర్ 11వ తేదీన కొత్త జిల్లాలు ఆ విర్భవించాయి. భూపాలపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలిసారి భూపాలపల్లి,

ములు గు శాసనసభ నియో జకవర్గాల ఓట్ల లెక్కింపు భూపా లపల్లిలో నిర్వహించే ప్రతిపాదనను అధికారులు పరిశీలి స్తుండటం విశేషం. శాసనసభ ఎన్నికల నిర్వహణపై మంగ ళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని తహసీల్దార్లతో కలెక్టర్ వెం కటేశ్వర్లు సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ లో స్పీడ్ పెరిగిన దరిమిల కొద్ది రోజుల క్రితం బదిలీ ఉత్తర్వు లు అందుకున్న డిప్యూటీ కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నంలో గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈక్రమంలో బదిలీపై నల్గొండ నుంచి భూపాలపల్లి ఆర్డీవోగా నియమితులైన వెం కటాచారి మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయ న భూపాలపల్లి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. 1-1-2018కి సంబంధించి సోమవారం ఓ టరు జాబితా ముసాయిదాను విడుదల చేసిన ఎన్నికల అ ధికారులు దీనిపై ఈనెల 25వ తేదీ వరకు ైక్లెయిమ్స్, అభ్యం తరాలను స్వీకరిస్తారు. ఈనెల 15, 16 తేదీల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. అక్టోబర్ 4వ తేదీన ైక్లెయిమ్స్, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 8వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.

156
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles