స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


Tue,September 11, 2018 02:09 AM

మంజూర్‌నగర్: శాసనసభా ఎన్నికల నిర్వహణ కోసం భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం, అంబేద్కర్ మినీహాల్‌ను సోమవారం కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. భూపాలపల్లి, ములుగు రెండు శాసనసభా నియోజకవర్గాల ఎన్నికల ప్రాసెసింగ్‌ను నిర్వహించాల్సి ఉన్నందున అంబేద్కర్ స్టేడియం, దాని పక్కన గల మినీహాల్‌లో గల అనుకూలతలు, ప్రతికూలతలను పరిశీలించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ సత్యనారాయణస్వామి ఉన్నారు.

తప్పులకు తావుండొద్దు..
తప్పులకు తావులేకుండా ఓటరు జాబితాను తయారు చేయాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు బూత్‌స్థాయి ఎన్నికల అధికారులను ఆదేశించా రు. సోమవారం స్థానిక ఇల్లందు క్లబ్ హౌజ్‌లో ఎ న్నికల ఓటరు జాబితా తయారీపై బూత్‌స్థాయి ఎన్నికల సిబ్బందికి అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులు, సిబ్బంది అంతా సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉంటే ఎన్నికల నిర్వహణ సులభతరమవుతుందని, బూత్ స్థాయి ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నది, లేనిది సరి చూసుకోవాలన్నారు. అలాగే నూతనంగా ఓటరు నమోదు కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కె.స్వర్ణలత, భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణస్వామి, వీఆర్వోలు పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...