ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి

Tue,September 11, 2018 02:09 AM

మంజూర్‌నగర్, సెప్టెంబర్ 10 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను వందశాతం సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలో ప్ర భుత్వ ఆస్పత్రులలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించడానికి కేంద్ర ప్ర భుత్వ ఆరోగ్యశాఖ నుంచి వచ్చి గత మూ డు రోజులుగా జిల్లాలో గల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సబ్‌హెల్త్ సెంటర్లను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులలో గల వైద్య పరికరాలు, పారిశుధ్యం తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లును కలిసి జిల్లాలో వారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను వివరించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన కేసీఆర్ కిట్, అమ్మఒడి, 108, 104 వంటి కార్యక్రమాల ద్వారా జిల్లాలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసిన వైద్యపరీక్షను నిర్వహించే హెల్త్ క్యూబ్‌లు కూడా సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కానీ ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో బలోపేతం చేయడానికి ఉపయోగించాల్సిన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఆర్‌సీహెచ్, ఎన్‌ఐడీడీసీపీ, ఎన్‌వీబీసీసీఐ, ఆర్‌ఎన్‌టీసీఐ, ఎన్‌ఎల్‌ఈఈపీ, ఐడీఎస్‌డీ పథకాల నిధులను సమర్థవంతంగా ఉపయోగిస్తే ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి మరింత సమర్థవంతంగా ప్రజలకు వైద్య సేవలందించవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య, కేంద్ర ప్రభుత్వ అధికారులు డాక్టర్ సాతులూరి రామచంద్రారావు, నిఖిల్ హెరూర్, డాక్టర్ స్నేహ శుక్ల, సత్యజిత్ సాహో, జయతినిగం, రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles