మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తా..

Tue,September 11, 2018 02:09 AM

కాటారం, సెప్టెంబర్10 : మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేసి అందరికీ అండగా నిలుస్తానని మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మండలకేంద్రంలో దామెరకుంటకు చెందిన సుమారు 50 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి పుట్ట మధు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అందిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను చూసి టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలువాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై అనేక నిరాధారమైన ఆరోపణలు చేయడంతోనే ప్రజల్లోనే తేల్చుకుందామని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు. రాష్ర్టానికి ఎవరు ఏం చేశారో ప్రజాక్షేత్రంలో న్యాయనిర్ణేతలైన ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 60ఏళ్లకు పైగా పాలించిన ప్రతిపక్ష పార్టీలు చేసినదానికంటే నాలుగున్నర ఏళ్ల టీఆర్‌ఎస్ పాలనలో చేసిన అభివృద్ధే మిన్న అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అవినీతి రహితంగా అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా స్థానికంగా ఉంటూ అందరికి నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో భాగస్వామినయ్యానన్నారు. నియోజకవర్గంలో గత పాలకుల నిరంకుశత్వానికి చరమగీతం పాడి నాలుగున్నరేళ్లలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేలా చేశానన్నారు. గత కాంగ్రెస్ పాలనకు ప్రస్తుత టీఆర్‌ఎస్ పాలనకు బేరీజు వేసి ప్రజలే తీర్పు ఇవ్వాలన్నారు.

గత నాలుగేళ్లుగా అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం చేసిన పనులే తనను మళ్లీ గెలిపిస్తాయన్నారు. ఏ పల్లెకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు మేలు చేసిన కేసీఆర్‌కు మరోసారి దీవెనలు అందిస్తామని చెబుతున్నారని అన్నారు. అభివృద్ధిని చూసి ఆకర్షితులైన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఇంకా చాలా మంది సంప్రదింపులు జరుపుతున్నారని, రాబోయే రోజుల్లో పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలోకి వస్తారన్నారు. పార్టీలో చేరినవారందరికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ తులిసెగారి శంకరయ్య, కో-ఆప్షన్ సభ్యుడు జావీద్‌ఖాన్, ఎంపీటీసీ కుమ్మరి అశోక్, నాయకులు భూపెల్లి రాజు, తైనేని సతీశ్, మందల లకా్ష్మరెడ్డి, నరివెద్ది శ్రీనివాస్, వంగల రాజేంద్రప్రసాద్, ఎలుబాక సుజాత, అనంతుల రమేశ్‌బాబు, కాయిత విఠల్, చిట్యాల సమ్మయ్య, గోనెముకుందం, రాజిరెడ్డి, మనోహర్‌నాయక్, బొడ్డు రాజబాపు, గుడిపాటి రమేశ్‌రెడ్డి, సడువలి, శ్యాంసుందర్, మహేందర్, దేవేందర్, రజనీకాంత్, బోడ తిరుపతి, రాజేంద్రప్రసాద్, గద్దె సమ్మిరెడ్డి, నిరంజన్, నాగేశ్వర్‌రావు, కుసుమ నరేశ్ తదితరులు ఉన్నారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles