పల్లెల్లో పచార హోరు

Mon,September 10, 2018 03:58 AM

-దూకుడు పెంచుతున్న గులాబీ శ్రేణులు
-అభ్యర్థుల రాకతో ఊపందుకున్న ప్రచారం
-తాజాగా ములుగు వచ్చిన మంత్రి చందూలాల్
-నియోజకవర్గ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం
-గెలుపే లక్ష్యంగా ముందుకుసాగాలని పిలుపు
-భూపాలపల్లిలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ భేటి
-టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని తీర్మానం
-కాటారం మండలం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు
జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారుతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఆ విష్కృ తమైంది. గులాబీ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం గా రంగంలోకి దిగారు. అభ్యర్థులు కూడా తమ నియోజ కవర్గాలకు చేరుకుంటుండడంతో దూకుడు పెంచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నా లుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో తలమునకలు అ య్యారు. గడప గడపకు వెళ్లి సకల జనులను కలు స్తున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నారు. దీం తో పల్లెల్లో ఎన్నికల ప్రచారం ఊపందు కుంటుంది. గులాబీ శ్రేణుల్లో జోష్ కనబడు తుంది. త్వరలో శాసనసభకు జరిగే ఎన్నికల కో సం టీఆర్‌ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 6వ తేదీన 105 ని యోజకవర్గాల నుంచి బరిలో నిలిచే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వి షయం తెలిసిందే. ఇందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాలు ఖరారు చేసి ఆ యన తన మాట నిలబెట్టుకున్నారు. ఈనేపథ్యంలో భూ పాలపల్లి స్థానం నుంచి స్పీకర్ సిరికొండ మధు సూదనాచారి, ములుగు నుంచి మంత్రి చందూలాల్, మం థని నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు టీ ఆర్‌ఎస్ నుంచి శాసనసభకు మరోసారి పోటీ చేసే అవకాశం ల భించింది.

దీంతో సీఎం కేసీఆర్ తమను పార్టీ అభ్యర్థులుగా ప్ర కటించిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి చందూ లాల్, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తమ నియో జకవర్గాలకు చేరుకున్నారు. వీరికి ఆయా నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. స్పీకర్ మధుసూ దనాచారి శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గానికి వచ్చారు. రేగొండ మండల కేంద్రం వద్ద టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. రేగొండ నుంచి భూ పాలపల్లి వరకు టీఆర్‌ఎస్ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో స్పీకర్ పాల్గొన్నారు. భూపాలపల్లిలో ర్యాలీ ముగిసిన తర్వాత ఆయన ఆ రోజు రాత్రి ఈ మం డలంలోని కమలాపురం గ్రామం లో పల్లె ప్రగతి ని ద్ర చేశారు. శని వారం కమలాపురం, గొల్లబుద్దారం గ్రామాల్లో పర్యటించి భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న తనను ఆశీర్వదించి ఈ ఎన్ని కల్లో గెలిపించాలని స్పీకర్ ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో అదే రోజు భూపాలపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమై ఎన్నికల ప్రచారంపై చర్చించారు. ఊరూరా టీఆర్‌ఎస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. అనం తరం రేగొండ మండలం కొడవటంచ గ్రామాన్ని సందర్శిం చారు.

తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ టీఆర్‌ఎస్ అ భ్య ర్థిగా శనివారం మంథని నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ యనకు నియోజకవర్గంలోని సబితం గ్రామం వద్ద టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కమాన్‌పూర్, రామగిరి, మంథని మండలాల్లోని వివిధ గ్రామాల మీదుగా నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన ఆయన టీఆర్‌ఎస్ మంథని నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల సమయంలో మంథని నియోజకవర్గ ప్రజలకు తాను ఇచ్చిన హామీలకు రెట్టింపు పనులు చేసి చూపించారని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశంలోని మరే రాష్ట్రంలో లేని రీతిలో తెలం గాణలో 400 ప్రత్యేక పథకాలను అమల్లోకి తెచ్చారని తెలి పారు. 400 ఏండ్ల వరకు ప్రజలు కేసీఆర్‌ను గుర్తుంచుకుం టారని, మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో తెలం గాణ పూర్తిగా సస్యశ్యామలం కాగలదని అన్నారు. ఆదివారం కాటారం మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన 50 మంది మహిళలు మంథనిలో పుట్ట మధూకర్ సమక్షంలో గు లాబీ కండువా కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి చందూలాల్ ఆ దివారం నియోజకవర్గ కేంద్రానికి వచ్చారు.

వివిధ కా ర్యక్రమాల్లో పాల్గొన్న ఆయన నియోజకవర్గంలోని టీ ఆర్‌ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ములుగులోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అ య్యారు. అనంతరం పొరుగున ఉన్న వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల వద్ద ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గం గారం మండలాల టీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో మంత్రి చందూలాల్ సమావేశం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంపై కార్యచరణ రూపొందించేందుకు చర్చించారు. తర్వాత హ న్మకొండలో ములుగు నియోజకవర్గంలోని మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, గోవిం దరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండలాల టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో మంత్రి చందూలాల్ సమావేశం నిర్వ హించారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి కార్యచరణ తయారు చేశారు. టీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ కూడా మంత్రి చందూలాల్‌తో పాటు పార్టీ ముఖ్యనేతల సమావేశాల్లో పాల్గొన్నారు. పల్లెల ప్రచారం కోసం గులాబీ శ్రేణులకు ఉత్తేజాన్ని ఇచ్చారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles