నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల


Mon,September 10, 2018 01:04 AM

మంజూర్‌నగర్, సెప్టెంబర్ 09 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి(108), ములుగు(109) శాసనసభల ముసాయిదా ఓటర్ జాబితా నేడు (సోమవారం) విడుదల చేయనున్నట్లు డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి పీ మోహన్‌లాల్ ఒక ప్రటకనలో పేర్కొన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు జాబితాను విడుదల చేస్తున్నామన్నారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేటి నుంచి 25వ తేదీ వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో బూత్ లెవల్ అధికారులతో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2018 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితాలో వారి పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులు అక్టోబర్ 4వ తేదీన పరిస్కరించనున్నట్లు చెప్పారు. 7వ తేదీన సవరణ చేసిన ఓటరు జాబితా తయారు చేసి, 8వ తేదీన ఫైనల్ ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు డీఆర్వో మోహన్‌లాల్ వివరించారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...