సమాజసేవ అభినందనీయం


Mon,September 10, 2018 01:03 AM

-వైద్యశిబిరం ప్రారంభంలో మంత్రి చందూలాల్
-అందరికీ ఆరోగ్యమే కేసీఆర్ లక్ష్యం
- అభివృద్ధిలో ములుగు ముందడుగు
ములుగు, నమస్తేతెలంగాణ : సమాజసేవ అభినందనీయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. ఆదివారం ములుగులో స్పర్ష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లయన్స్‌క్లబ్ సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అసెంబ్లీ రద్దు తర్వాత మంత్రిగా కొనసాగుతున్న చందూలాల్ మొదటిసారిగా ములుగుకు రావడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చందూలాల్ మాట్లాడారు. అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా కంటివెలుగు పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా ప్రజాసేవ చేసేందుకు ముందుకు రావడం, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావడం గొప్పవిషయమన్నారు. ములుగు ప్రాంతం మునుపెన్నడూలేని విధంగా అభివృద్ధి పథంలో ముందడుగు వేసిందన్నారు. పల్లెల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు సంక్షేమ పథకాలను అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నారనిఅన్నారు.. ప్రతిపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక విమర్శలు చేయడానికి మాత్రమే పనిచేస్తాయన్నారు. సమావేశంలో ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్, డీఎస్పీ విజయసారథి, లయన్స్ జిల్లా 320 ఎఫ్ గవర్నర్ కేసీ జాన్ బన్నీ, రీజన్ చైర్మన్ రాజమౌళి, జోన్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, అధ్యక్షురాలు తస్లీమా, సభ్యులు గంగిశెట్టి శ్రీనివాస్, రమేశ్, సాంబశివ, బలరాం, డాక్టర్ రఘు, డాక్టర్ ప్రవీణ్ చందర్, స్పర్ష్ ఫౌండేషన్ చైర్మన్ ప్రభాకర్‌నాయక్, టీఆర్‌ఎస్ నాయకులు మహేందర్, సత్యనారాయణ, మ్యాక్స్‌కేర్ దవాఖాన సిబ్బంది, జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...