పీడీఎస్ బియ్యం పట్టివేత

Mon,September 10, 2018 01:02 AM

-బాణాలపల్లి వద్ద పట్టుకున్న పోలీసులు
-165 క్వింటాళ్ల బియ్యం సీజ్
ములుగురూరల్, సెప్టెంబర్ 09 : అర్థరాత్రి అక్రమంగా గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మండలంలోని అబ్బాపురం గ్రామ పంచాయతీ పరిధి బాణాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంత కాలంగా మండలంలోని పలు గ్రామాల్లోని రేషన్ షాపుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసిన లబ్ధిదారులకు కిలో చొప్పున డబ్బులను ఎర చూపి అక్రమ అబ్బాపురం గ్రామం కేంద్రంగా పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్ర నాగాపూర్‌కు తరలిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు వీరారెడ్డి, రమణారెడ్డి, సుధీర్ శనివారం రాత్రి అబ్బాపురం గ్రామంలో నిఘాపెట్టారు. గ్రామానికి చెందిన బాదం ప్రవీణ్ సహకారంతో నలుగురు వ్యక్తులు పీడీఎస్ బియ్యాన్ని లారీ సహాయంతో అక్రమంగా మహారాష్ర్టానికి తరలిస్తుండగా బాణాలపల్లి గ్రామం వద్ద మాటు వేసి పట్టుకున్నారు. లారీలో మొత్తం 324 బస్తాల(165క్వింటాళ్ల) బియ్యం ఉండటాన్ని గుర్తించి బియ్యంతో పాటు లారీని సీజ్ చేశారు. ఈ దాడుల్లో దేశాయిపేటకు చెందిన జన్ను అనిల్‌తో పాటు లారీ డ్రైవర్ షేక్ ఇమ్రాన్ పట్టుపడగా అబ్బాపురం గ్రామానికి చెందిన బాదం ప్రవీణ్, పరకాలకు చెందిన మహేశ్ అనే వ్యాపారులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. కాగా పట్టుకున్న బియ్యాన్ని పోలీసులు ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించి సదరు వ్యాపారులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ములుగు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అబ్బాపురం గ్రామం కేంద్రంగా గతంలో సైతం పీడీఎస్ బియ్యం భారీ మొత్తంలో పట్టుబడటం విశేషం.

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles