పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Mon,September 10, 2018 01:02 AM

కాటారం, సెప్టెంబర్ 09 : కుల మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలిసి ఉంటూ పండుగలను ప్రశాంతంగా, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కాటారం డీఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు కోరారు. కాటారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి, మొహర్రం పండుగలను హిందూ ముస్లింలు మత సామరస్యంతో జరుపుకోవాలన్నారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసులకు తెలియజేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మైక్ కోసం మీసేవా ద్వారా చలాన కట్టి డీఎస్పీ కార్యాలయంలో అనుమతి తీసుకోవడం తప్పనిసరన్నారు. మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత కమిటీని ఏర్పాటు చేసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల వివరాలను పోలీసులకు తెలియజేయాలన్నారు. ఏ రోజు నిమజ్జనం చేస్తారో, ఎక్కడ నిమజ్జనం చేస్తారో వివరాలు అందించాలన్నారు. నిమజ్జనం రోజున మద్యం తాగి హంగామా చేయడం, డీజేలు పెట్టి డ్యాన్స్‌లు చేయడం చేస్తే కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శివప్రసాద్, ఎస్సై ముత్తె నరేశ్, నాయకులు తోట జనార్ధన్, మందల లకా్ష్మరెడ్డి, లిక్కి శ్రీనివాస్, బ్రహ్మరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, వ్యాపారులు, పలు గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

129
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles