చెట్లే దైవం..

Sun,September 9, 2018 03:32 AM

రేగొండ, సెప్టెంబర్ 08 : చెట్లు సృష్టిలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దేవుళ్లని, వాటికి దైవ శక్తి ఉందని.. వాటిని మనం కాపాడితే.. అవి మనల్ని రక్షిస్తాయని శాసన సభ స్పీకర్ సి రికొండ మధుసూదనాచారి అన్నారు. లక్ష్మీనరసింహస్వా మి ఆలయంలో శనివారం స్పీకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మండలంలోని కొడవటంచ గ్రామంలో శనివారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రా మంలోని ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించి వారితో ప్రతి జ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తున్న లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షిచడం అందరు బాధ్యతగా తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోనే కొడవటంచ గ్రామం హరిత ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందాలన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం సామాజిక ఉద్యమమని, తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్ది భవిష్యత్‌ను ఆనందమయం చేసుకోవడంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రానున్న ఎన్నికలో ప్రజలు ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో ఈవో కే సులోచన, టీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ క్రాంతికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌గౌడ్, ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, ఎంపీపీ ఈర్ల సదానందం, నాయకులు మైస భిక్షపతి, పున్నం రవి, దాసరి నారాయణరెడ్డి, ఐలు శ్రీధర్, నూనె వెంకటేశ్వర్లు సూర నర్సింగరావు, శ్రీనివాస్, పబ్బ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ..
మండలంలోని నారాయణపురంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శనివారం పరామర్శించారు. నారాయణపురం గ్రామానికి చెందిన ఏడునూతుల వేదవతి, ముప్పు కొంరయ్యలు మృతి చెందగా వారి కుటుంబాలను స్పీకర్ పరామర్శించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు ఉన్నారు.

137
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles