కమలాపూర్ ప్రజల ఆదరణ మరువలేనిది

Sun,September 9, 2018 01:16 AM

భూపాలపల్లిరూరల్, సెప్టెంబర్ 08 : పల్లె నిద్ర కార్యక్రమంలో కమలాపూర్ గ్రామ ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిదని, గ్రామంలో జరిగిన అభివృద్ధి కారణంగానే ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలికారని రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం రాత్రి భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో ప్రగతి పల్లె నిద్ర చేసిన స్పీకర్ శనివారం ఉదయం నిద్ర లేవగానే గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేశానని, ప్రభుత్వ స్థలం అందుబాటులోలేక డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించలేదని చెప్పారు. గతంలో గ్రామానికి రావాలంటే ప్రజలు ఇబ్బందుల పడేవారని, కాని ప్రస్తుతం 10నిమిషాలలో జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లే విధంగా రోడ్డును నిర్మించామని తెలిపారు. ప్రజలు కోరుకున్న విధంగా ఆముదాలపల్లి గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటుచేశానని అన్నారు. నూతన గ్రామపంచాయతీ ఆముదాలపల్లికి బైక్ ర్యాలీగా వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మళ్లీ ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే మహత్తరమైన అభివృద్ధి చేసి గ్రామాన్ని మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, మండలపార్టీ అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్‌గౌడ్, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర సభ్యులు ముద్దమల్ల భార్గవ్, టీఆర్‌ఎస్ నాయకులు తాటి వెంకన్న, చెరుకుతోట శ్రీరాములు, వేల్పుల రాజబాబు, తిప్పని రంజిత్‌గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు కొమ్మెర అశోక్, స్థానిక నాయకులు రాజుగౌడ్, సుధాకర్, మునిందర్ తదితరులు పాల్గొన్నారు.

143
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles