హరితహారం దేశానికే ఆదర్శం

Sun,September 9, 2018 01:15 AM

-ములుగు డీఎస్పీ విజయసారథి
గణపురం , సెప్టెంబర్ 08 : హరితహారం దేశానికే ఆదర్శమని నేడు నాటిన మొక్కలు రేపటి వృక్షాలుగా ఎదిగి భావితరాలకు ఫలాలను అందిస్తాయని ములుగు డీఎస్పీ విజయసారథి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో నాలుగో విడుత హరితహారం భాగంగా గణపురం ఎస్సై దేవుళ్లపెల్లి వెంకటఫణి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించిపోయి వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతుందన్నారు. అడువులకు పూర్వవైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం 2 లక్షల మొక్కల పెంపకం మేరకు పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములై లక్ష్యాన్ని మించి మొక్కలు నాటి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. విద్యార్థులు మొక్కల ఆవశ్యకతపై తల్లిదండ్రులకు వివరించి వారితో మొక్కలు నాటించాలన్నారు.. ఈ కార్యక్రమంలో ములుగు సీఐ రాజు, తహసీల్దార్ జివాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్, ఎంపీపీ పోతారం శారద, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దివి ప్రసాద్‌నాయుడు, ప్రిన్సిపాల్ చైతన్యకుమార్, ఉపాధ్యాయులు నవీన్, మసూద్ పాల్గొన్నారు.

111
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles