రాజీ మార్గమే రాజమార్గం

Sun,September 9, 2018 01:15 AM

-ములుగు సివిల్ కోర్టు జడ్జి కుమారస్వామి
ములుగుటౌన్, సెప్టెంబర్ 08: వివిధ కేసులతో కోర్టుల చుట్టూ తిరిగే వారు రాజీ కుదుర్చుకొని ముందుకు సాగాలని ములుగు సివిల్‌కోర్టు జడ్జి కుమారస్వామి అన్నారు. పట్టణకేంద్రంలోని జూనియర్ సివిల్‌కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో భాగంగా 67 సివిల్, క్రిమినల్ కేసులు, అలాగే 60 గుడుంబా తయారీదారుల కేసులను జడ్జి పరిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో విలువైన సమయాన్ని వృ థా చేసుకుంటూ చిన్నచిన్న తగాదాలకు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగవద్దని సూచించారు. ఈ లోక్‌అదాలత్‌లో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు సీహెచ్ వేణుగోపాలాచారి, ఉపాధ్యక్షుడు బా నోత్ స్వామిదాస్, కార్యదర్శి రంగోజు భిక్షపతి, కోశాధికారి కొండి రవీందర్, లీగల్ సెల్ అథారిటీ సర్వీస్ మెంబర్ మేకల మహేందర్, లీగలైడ్ అడ్వకేట్ బాలుగు చంద్రయ్య, సీనియర్ న్యాయవాది వై న ర్సిరెడ్డి, బొల్లి సారంగపల్లి, కన్నోజు సునిల్‌కుమార్, ఎక్సైజ్ సీఐ సు ధాకర్, ఎస్సై భారతి, కోర్టు కానిస్టేబుళ్లు రఘు, రాజేశ్, రాజు, తాజొద్దీన్, మొగిలి, రామ్మూర్తి, రవీందర్, లైజనింగ్ ఆఫీసర్ మనోహర్‌రావు, కక్షిదారులు పాల్గొన్నారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles