బిల్ట్‌లో జేఏసీ సమావేశం


Sun,September 9, 2018 01:15 AM

మంగపేట సెప్టెంబర్ 08: మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీలో శనివారం కార్మిక జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జేఏసీ నాయకులు వీ రాంచందర్, వడ్డెబోయిన శ్రీనివాసులు, పాకనాటి వెంకట్‌రెడ్డి, వీ రవిమూర్తి, కూర్బాన్‌అలీ, మునిగాల వెంకటేశ్వర్లు తదితరులు హాజరై కార్మికులనుద్దేశించి మాట్లాడారు. గత నాలుగేళ్లుగా ఉత్పత్తి నిలచిపోయిన బిల్ట్ పరిశ్రమ సమస్య, వేతనాలు అందని కార్మికుల దయనీయ పరిస్థితిని అర్థచేసుకొని ప్రభుత్వం పునరుద్ధ్దరణకు చేయూతనివ్వడం హర్షనీయమన్నారు. బిల్ట్ ఫ్యాక్టరీ రాయితీలకు సంబంధించిన జీవో విడుదల చేసి కార్మికుల్లో మనోధై ర్యం నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటుగా, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ సీతారాంనాయక్, రాజ్యసభ సభ్యుడు మోహన్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సద్వినియోగం చేసుకొని బిల్ట్ ఫ్యాక్టరీ పున:ప్రారంభ చర్యలు చేపట్టడంతోపాటుగా, కార్మికులకు పెం డింగ్ వేతనాలు చెల్లింపులు జరపాలని కోరారు. ఇన్నేళ్ల కార్మికల శాంతియుత పోరాటానికి చేయూతను అందించిన ఆయా పార్టీలు, ట్రేడ్ యూనియన్‌లు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులకు కూడా జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
జేఏసీకి యాజమాన్యం నుంచి పిలుపు
బిల్ట్ కార్మిక జేఏసీకి పరిశ్రమ యాజమాన్యం నుంచి చర్చలకు పిలు పు వచ్చినట్లు జేఏసీ నేతలు శనివారం ప్రకటించారు. రేపు (సోమవా రం) సికింద్రాబాద్‌లోని బిల్ట్ కార్యాలయంలో నిర్వహించబోయే స మావేశానికి జేఏసీ బృందం హాజరవుతుందని కార్మికులకు వివరించారు. సమావేశంలో బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సంబంధించి చ ర్చలు జరుపనున్నట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో కార్మిక జేఏసీ నాయకులు పప్పు వెంకట్‌రెడ్డి, వంగేటి వెంకట్‌రెడ్డి, నర్సింహరావు, శర్మ, కార్మికులు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...