నయనానందం..

Sat,September 8, 2018 02:09 AM

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 07 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని పద్దెనిమిది కంటి వెలుగు కేంద్రాల్లో 21బృందాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కాగా, శుక్రవారం జిల్లాలో గల 18కేంద్రాలలో 3307 మంది కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్నారు. 783మందికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అద్దాలను పంపిణీ చేశారు. అలాగే 222 మందిని శస్త్ర చికిత్సల నిమిత్తం వరంగల్‌లోని కంటి హాస్పిటల్స్‌కు రెఫర్ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 46,364 మంది కంటి పరీక్షలు చేయించుకున్నా రు. 12,408 మందికి అద్దాల పంపిణీ జరుగగా, 5,739 మందిని శస్త్రచికిత్సలకు రెఫర్ చేశారు.

రాంనగర్‌లో 295 మందికి కంటి పరీక్షలు..
ఏటూరునాగారం, సెప్టెంబర్ 07 : మండలంలోని రాంనగర్ గ్రామంలో శుక్రవారం కంటి వె లుగు పరీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా 295 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి అభినందన్‌రెడ్డి తెలిపారు. అవసరమైన వారికి అద్దాలు అందించినట్లు వివరించారు. మరికొందరికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా వారిని శస్త్ర చికి త్స కోసం రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాటా ఎంట్రీ ఆపరేటర్ జైలుబాబు, ఆప్తాల్మిక్ అసిస్టెంటు భాగ్యమ్మ, ఏఎన్‌ఎం ధనలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

కొనసాగుతున్న కంటి వెలుగు..
ములుగుటౌన్, సెప్టెంబర్ 07 : ములుగు పట్టణకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరంలో శుక్రవారం 188మందికి కంటిపరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి మధు తెలిపారు. వీరిలో 22మంది శుక్లాలతో బాధపడుతున్నట్లు గుర్తించి వారికి ఆపరేషన్ కోసం వరంగల్ కంటి దవాఖానకు రెఫర్ చేసినట్లు వెల్లడించారు. అలాగే 85మందికి కంటి అద్దాలను అందించామని, మిగిలిన 46మందికి వచ్చే నెలలో అద్దాలను అందిస్తామని ఆయన వెల్లడించారు. కాగా, కంటి వెలుగు కార్యక్రమంలో అద్దాలు పొందిన ఇద్దరు బాల్య మిత్రులు తోట రమేశ్, ముసినేపల్లి భిక్షపతిగౌడ్‌లు తమకు ఒకే రోజు కంటి అద్దాలు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఇలాంటి మంచి పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి చందూలాల్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

58మందికి అద్దాలు పంపిణీ..
మంగపేట, సెప్టెంబర్ 07 : మండలంలోని బోరునర్సాపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో శుక్రవారం 112మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 58మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి తరుణి మాట్లాడుతూ ఈనెల 11వరకు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈఅవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగ పరుచుకొని కంటి సమస్యలున్న వారు ఉచితంగా అద్దాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు మంజుల, హెల్త్ సూపర్ వైజర్లు రాంబాయి, లక్ష్మి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

దొబ్బల పహడ్‌లో..
మహాముత్తారం : మండలంలోని దొబ్బల ప హడ్ మోడల్ స్కూల్ పాఠశాలలో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. 252మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్యుడు గోపినాథ్ తెలిపారు. అందులో ఆరుగురు విద్యార్థులకు కళ్లద్దాలు అందచేశామని, మరో 11 మం దికి కంటి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపా రు. 8మందికి కంటి ఆపరేషన్ అవసరముందని ఆయన వివరించారు. డాక్టర్ సదానందం, డాక్టర్ భరత్ , ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles