పెసాకు గ్రామసభ ఆమోదం


Fri,September 7, 2018 02:46 AM

వెంకటాపురం(నూగూరు): మండల పరిధిలోని వీరభద్రవరం ఇసుక సొసైటీ పెసా గ్రామసభ గురువారం పంచాయతీ కార్యాలయంలో అధికారులు నిర్వహించారు. పంచాయతీ పరిధిలో 130 గిరిజన కుటుంబాలు సభ్యులుగా నమోదై సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా 2.40లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకను గోదావరి నుంచి ఒడ్డుకు తరలించేందుకు అనుమతులు వచ్చాయి. ఈ సందర్భంగా పెసా కమిటీ గ్రామసభను ఆంజనేయ గిరిజన మహిళా ఇసుక క్వారీ సొసైటీ ఏర్పాటు చేసుకోగా అధికారుల సమక్షంలో చేతులెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. సొసైటీ అధ్యక్షురాలు నల్లెబోయిన రాధ, పాలకవర్గ సభ్యులు సొసైటీగా నమోదయ్యారు. పెస గ్రామసభ కో ఆర్డినేటర్ ప్రభాకర్ అద్యక్షత వహించగా ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, కో ఆపరేటీవ్ అధికారి వేణు, ఐకేపీ అధికారి వేణుగోపాలరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కిషన్, కార్యదర్సి సామోల్ పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...