తొలిముద్ర బలంగా..


Thu,September 6, 2018 02:20 AM

-రేపు హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ
-50 వేల మందితో భారీ బహిరంగసభ
-ఎల్కతుర్తిలో టీఆర్‌ఎస్ శ్రేణులతో మంత్రి ఈటల సన్నాహక సమావేశం, భారీ బైక్ ర్యాలీ
-హాజరైన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు,ఎమ్మెల్యే సతీశ్‌కుమార్

ఎల్కతుర్తి, సెప్టెంబర్ 05: ప్రభుత్వ పరిపాలనపై ప్రజలను ఆశీర్వాదం కోరుతున్నామని, అందులో తొలి ఆశీర్వాదం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలదేనని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ నెల 7న హుస్నాబాద్‌లో నిర్వహించనున్న ఆశీర్వాద సభకు సంబంధించి ఎల్కతుర్తి మండల కేంద్రం లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, వొడితెల సతీశ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా సభ విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూ హంపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నాలుగేండ్ల కాలంలో ప్రభుత్వం ఏం చేయలేదని ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని, వారి మాటలు వింటే నవ్వొస్తుం దన్నారు. ఉద్యమం అప్పుడు ఇలానే అన్నారని, అప్పుడు తిట్టినోళ్లందరూ ఇప్పుడు మన పార్టీలోనే ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షాలకు తప్పకుండా ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ప్రజల ప్రేమను పొందాం అనడానికి హైదరాబాద్, రేపటి హుస్నాబాద్ సభే నిదర్శనమని పునరుద్ఘాటించారు. మండలం నుంచి 11వేల మంది తరలిరావాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలి..
- రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హుస్నాబాద్ ప్రాంతమంటే ఎంతో ఇష్టమని, అందుకే సీఎం కేసీఆర్ ఆశీర్వాదం కోసం మొదటిసారిగా హుస్నాబాద్‌కు వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు చెప్పారు. తప్పకుండా సీఎం కేసీఆర్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు, పార్టీ నాయకులు, కా ర్యకర్తలు సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చీమలదండులా కదలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. ఛాతి విరుచుకొని చెప్పుకునేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. రాహుల్‌గాంధీ సభకైనా ఏనాడైనా ప్రగతినివేదన సభకు వచ్చినంత ప్రజలు వచ్చారా అని ప్రశ్నించారు. పేదల కోసం, ప్రజల సంతోషాల కోసం పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు.

సభను విజయవంతం చేయాలి
- హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారిగా సభకు వచ్చేందుకు కార్యచరణను రూ పొందించారు. ప్రగతి నివేదన సభకు వెళ్లివస్తూ మృతి చెందిన సోమారం గ్రామానికి చెందిన దొనికెల రాజయ్యగౌడ్ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషా లు మౌనం పాటించారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీల నాయకులు సుమారు 50 మంది వరకు ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, విద్యాసాగర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గోపాల్‌పూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ చిదురా ల రాజమౌళి, సుధాకర్, జీల్గులకు చెందిన గూటం సమ్మిరెడ్డికి ఎమ్మెల్యేలు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి ఈటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎల్కతుర్తి చివరి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి సైతం బైక్ మీద ఎక్కి కార్యకర్తలను ఉత్సహ పరిచారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్, ఎంపీపీ తంగెడ శాలినీ, మండల అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, శ్రీపతి రవీందర్‌గౌడ్, బచ్చు కిషన్‌రావు, తంగెడ మహేందర్, ఎల్తూరి స్వామి, మునిగడప శేషగిరి, మునిగడప లావణ్య, గొల్లె మహేందర్, చల్లా రవీందర్‌రెడ్డి, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, బోయినపల్లి లింగారావు, వెంకటేష్‌యాదవ్, పిట్టల మహేందర్, అల్లకొండ రాజు, డకిరె రాజేశ్వర్‌రావు, అబ్బనవేన రాజ య్య, గుండా ప్రతాపరెడ్డి, రవీందర్‌రావు, రాజేశ్వర్‌రావు, తిరుపతిరెడ్డి, దేవేందర్‌రావు, మేకల కోమ ల, వేముల శ్రీనివాస్, ఆరెపల్లి రాజయ్య, దుగ్యాని సమ్మ య్య, వినయ్, వలీపాషా, చిట్టిగౌడ్, బొంకూరి భద్రయ్య, కమ్రోద్దీన్, సాతూరి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...