లెక్చరర్ల ఉద్యోగాల దరఖాస్తులకు ఆహ్వానం


Thu,September 6, 2018 01:15 AM

మహదేవపూర్, సెప్టెంబర్ 05 : తెలంగాణ విద్యా కళాశాల కమిషనర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాల దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు బుధవారం డిగ్రీ కళాశాల ప్రినిపాల్ డాక్టర్ రామచంద్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్, కామర్స్ సబ్జెక్టులకు గానూ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని కంప్యూటర్స్ సబ్జెక్టుగానూ ఎంఎస్సీ కంప్యూటర్స్ లేదా ఎంటెక్ అర్హత, కామర్స్‌కు గానూ ఎంకామ్ అర్హతలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఆయా సంబంధిత కోర్సులో 55 శాతం ఉత్తీర్ణత మార్కులు కల్గిండాలని, నెట్ లేదా సెట్, పీహెచ్‌డీ అర్హతలు కల్గిఉన్న వారికి ఉద్యోగ భర్తీలో ప్రాధానత్య ఉంటుందని వెల్లడించారు. బోధన అర్హత ఉన్నవారు ఈనెల 10వ తేదీలోగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులను అందజేయాలన్నారు. 11వ తేదీన ఉద యం 10 గంటలకు ములుగులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...