ఏటూరునాగారం బస్సుడిపో పనులకు రూ. కోటి విడుదల

Thu,September 6, 2018 01:15 AM

ప్రకటించిన మంత్రి చందూలాల్
ఏటూరునాగారం, సెప్టెంబర్ 05 : ఏటూరునాగారం మండలకేంద్రంలో బస్సుడిపో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని, దీంతో ములుగు నియోజకవర్గ ప్రజల చిరకాలవాంఛ నెరవేరబోతుందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు బస్సు డిపో నిర్మాణానికి అయ్యే వ్యయంలో రూ.కోటి నియోజకవర్గం అభివృద్ధి ని ధుల నుంచి విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. దీనికి సం బంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. బస్సు డిపో నిర్మాణం కో సం పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నా రు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బస్సు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూర ప్రాంతాలకు ప్ర యాణించే అవకాశంతో పాటు మారుమూల గ్రామాలు, అన్ని మండలాలకు బస్సుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని వి వరించారు. నియోజకవర్గంలోని ప్రజలు, రైతులకు నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రానికి అను సంధానం పెరుగుతుందన్నా రు. ఇందుకు సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. వారం రోజుల్లో సం స్థ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో పనుల పురగోతిపై సమీక్షించనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఏటూరునాగారంలో బస్సు డిపో ఏర్పాటు అయితే చత్తీస్‌గఢ్, మహారాష్ర్టాలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. ఇక బస్సు డిపో ఏర్పాటు అయితే స్థానికులకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.
త్వరలో పనులు ప్రారంభం
బస్సు డిపో పనులు వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్య కిరణ్ తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. కోటి మంజూరు చేసిన నేపథ్యంలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్సుడిపో ఏర్పాటు చేస్తే అనేక ప్రాంతాలకు మంచి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కూడా బస్సులు పెరిగే అవకాశం ఉందన్నారు. వీలైనంత త్వరలోనే పనులు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles