రహదారుల నిర్మాణానికి భూసేకరణ పూర్తిచేయాలి


Thu,September 6, 2018 01:15 AM

మంజూర్‌నగర్, సెప్టెంబర్ 05 : జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణానికి చేపట్టాల్సిన భూ సేకరణ అంశంపై తగు ఆదేశాలు జారీ చేశా రు. ఈ మధ్యకాలంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం నుంచి అధికం గా నిధులు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. జాతీయ రహదారుల ని ర్మాణానికి కావాల్సిన భూసేకరణను స్థానికంగా సరిగ్గా చేయకపోవడం వల్ల పనులు సకాలంలో ప్రారంభం కాకపోవడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి అసంతృప్తి వ్యక్తం చేశారని, స్థానికంగా ఏమైనా సమస్యలుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వెంటనే భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. నిర్ణీత సమయం లక్ష్యంగా పెట్టుకుని దానికి అనుగుణంగా భూసేకరణ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జేసీ కె.స్వర్ణలత, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...