న్యూట్రి బాస్కెట్ యూనిట్ మంజూరు


Thu,September 6, 2018 01:15 AM

ఏటూరునాగారం, సెప్టెంబర్ 05 : న్యూట్రి బాస్కెట్ యూనిట్ నిర్వహణ కోసం నాలుగు మండలాల నుంచి మహిళా సంఘం గ్రూపును ఎంపిక చేయాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఐకేపీ సిబ్బంది, జేడీఎం కొండల్‌రావు, డీపీఎం వేణుగోపాల్, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాలకు చెందిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు, తదితరులతో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ న్యూట్రి బాస్కెట్ యూనిట్ ఐటీడీఏకు మంజూరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నాలుగు మండలాల నుంచి ఎంపిక చేసిన గ్రూపు ద్వారా నిర్వహణ చేపట్టనున్నామని, గ్రూపును ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం క ల్పించేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన్ కింద శిక్షణ ఇవ్వనున్నామని, వారిని కూడా గుర్తించాలని ఆయన కోరారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...