ది బెస్ట్‌గా అమలు చేస్తా

Wed,September 5, 2018 12:44 AM

-తుది దశకు మిషన్ భగీరథ పనులు
-డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో స్పీడ్
-అక్టోబర్ 2 వరకు నూరుశాతం ఓడీఎఫ్
-త్వరలో పెండింగ్ భూరికార్డుల క్లియరెన్స్
-అటవీ గ్రామాల్లో హద్దులకు జాయింట్ సర్వే
-హరితహారం టార్గెట్ ఈ నెలాఖరు
-నాలుగైదు రోజుల్లో సబ్సిడీ బర్రెల పంపిణీ
-వైద్యం, విద్య, రవాణాకు అధిక ప్రాధాన్యం
-ఏజెన్సీ ప్రజలకు 24గంటలు వైద్యసేవలు
-అధికారులు విధిగా హెడ్‌క్వార్టర్‌లో ఉండాలి
-ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి
-నమస్తే తెలంగాణతో కలెక్టర్ వెంకటేశ్వర్లు

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాలన్నీ కూడా నాకు ప్రాధాన్య అంశాలు. ప్రస్తు తం మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, బహిరం గ మల విసర్జన రహిత(ఓడీఎఫ్), పెం డింగ్‌లో ఉన్న ల్యా ండ్ రికార్డ్సును క్లి యర్ చేయడం, హరితహారం కార్యక్రమం, వైద్యం, విద్యకు టాప్ ప్రియారి టీ. అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వార్టర్‌లో ఉండాలి. ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సి బ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏజెన్సీలో 24గంటలు వైద్యసేవలు అందించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిదినాల్లో తప్పనిసరిగా నిర్ధేశిత వేళల ప్రకారం విధులు నిర్వహించాలి. వార్డెన్లు ఖచ్చితంగా తాము పనిచేసే హా స్టళ్లు, గురుకుల పాఠశాలల్లోనే ఉండాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ) లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లు, హాస్టళ్లు, గురుకులాలు, అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో జిల్లాలో లబ్ధిదారులకు సబ్సిడీపై బర్రెల పంపిణీ ప్రారంభిస్తాం. గొల్ల, కురుమలకు త్వరలోనే రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ మొదలు పెడతాం. చెరువుల్లో ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. ప్రతీ సోమవారం ప్ర జావాణి(గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు నుంచి జిల్లాలో పర్యటన ప్రారంభించారు. తొలిరోజే మహాదేవ్‌పూర్ మండలంలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆయన వార్డెన్‌కు మెమో జారీ చేశారు. తెల్లవారి శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష జరిపారు. మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సుకు హాజరైన జిల్లా కలెక్టర్ సాయంత్రం మహాదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో వేగం పెంచే దిశలో ముందుకు వెళ్తున్న వెంకటేశ్వర్లు జిల్లా పాలన అధికారిగా తన ప్రాధాన్య అంశాలపై నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎమన్నారంటే ఆయన మాటల్లో...

డబుల్ వేగం ..

డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ప్ర స్తుతం జిల్లాలో లబ్ధిదారులతో కమిటీలను ఏర్పాటు చేసి డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. ఈ ఇండ్ల నిర్మాణం పై ఇప్పటికే సంబంధిత ఇంజనీర్లతో సమావేశమై సమీక్ష జరిపా ను. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించాను. త్వరలో మళ్లీ సం బంధిత ఇంజినీర్లతో సమావేశమై డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహిస్తాను. కొన్ని గ్రామాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లి వద్ద నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.

టార్గెట్.. అక్టోబర్ 2

జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) జిల్లాగా వచ్చే అక్టోబర్ రెండో తేదీవరకు తీర్చిదిద్దాలనేది టార్గెట్. ఇప్పటి వరకు జిల్లాలో 72 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ లోపు జిల్లాలో మిగతా 28 శాతం మ రుగుదొడ్లు నిర్మించి ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించాలనే పట్టుదలతో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. ఓడీఎఫ్ లక్ష్యాన్ని అధిగమిస్తామనే విశ్వాసం ఉంది.

భూరికార్డుల క్లియరెన్స్..

భూములకు సంబంధించి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నా యి. భూ రికార్డులు ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది. వివాదాల ను పరిష్కరించి భూరికార్డులను క్లియర్ చేస్తేనే రైతు బంధు పథ కం నుంచి నవంబర్‌లో రైతులకు రెండో విడత పంట పెట్టుబడి సాయం అందనుంది. ఆ లోపు భూరికార్డులను క్లియర్ చేస్తాం. రైతులకు పట్టాదారు పాసుబుక్కులు అందజేస్తాం. ఇందుకోసం త్వరలోనే రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించేందు కు సిద్ధమవుతున్న. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి భూ వివాదాలు నెలకొన్న అటవీ గ్రా మాల్లో జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తాం. సా ధ్యమైనంత వరకు భూవివాదాలను పరిష్కరిస్తాం. పట్టాదారు పాసుబుక్కులు అందితే రైతులకు రూ.5లక్షల రైతు బీమా కూ డా వర్తించనుంది. నాలుగైదు రోజుల్లోనే రైతు బీమా ైక్లెయిమ్ అవుతుంది.

తుదిదశలో మిషన్ భగీరథ..

మిషన్ భగీరథ పథకం మంచి కార్యక్రమం. ఇంటింటికీ నల్లా ద్వారా శుద్ధిచేసిన తాగునీరు అందించాలనే సం కల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా లో నాలుగు సెగ్మెంట్ల ద్వారా మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం పనులు జరుగుతున్నాయి. మొత్తం 884 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 830 ఆవాసాలకు మిషన్ భగీరథ నుంచి బల్క్ వాటర్ ఇస్తు న్నాం. మరో 54 ఆవాసాలకు బల్క్‌వాటర్ ఇవ్వాల్సి ఉంది. గో దావరి-మంగపేట సెగ్మెంట్ పరిధిలో 326 ఆవాసాలకు గానూ 319 ఆవాసాలకు, గోదావరి-పూసూరు సెగ్మెంట్ పరిధిలో 147 ఆవాసాలకు, మంథని-కోనంపేట సెగ్మెంట్ పరిధిలో 184 ఆవాసాలకు గానూ 169, మంథని-భూపాలపల్లి సెగ్మెం ట్ పరిధిలో 227 ఆవాసాలకు గానూ 195 ఆవాసాలకు బల్క్ వాటర్ సైప్లె అవుతుంది. గోదావరి-మంగపేట సెగ్మెంట్‌లో ఏ డు, మంథని-కోనంపేట సెగ్మెంట్‌లో 15, మంథని-భూపాలపల్లి సెగ్మెంట్‌లో 32 ఆవాసాలకు ఇంకా బల్క్ వాటర్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ 54 ఆవాసాలకు కూడా 10వ తేదీలోగా మిషన్ భగీరథ ద్వారా బల్క్ వాటర్ అందుతుంది. ఆయా ఆవాసంలో ఇంట్రావిలేజ్ పనుల్లో కూడా స్పీడ్ పెంచాం.

నెలఖరులోపు హరితహారం..

నాలుగో విడత తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా ఈ ఏడాది జిల్లాలో 1.13 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. ఇందులో ఇప్పటి వరకు 52శాతం మొక్క లు నాటడం జరిగింది. మిగతా 48 శాతం మొక్కలను ఈ నెలాఖరులోపు నాటాలనేది టార్గెట్. దీనిపై అటవీశాఖ అ ధికారులతో సమీక్ష నిర్వహించాను. ఈ నెలాఖరు వరకు నిర్ధేశిత లక్ష్యం మేరకు 1.13 కోట్ల మొక్కలు నాటడం పూ ర్తికాగలదు. జిల్లాలో 468 మంది లబ్ధిదారులకు సబ్సిడీ బర్రెలను పంపిణీ చేయాల్సి ఉంది. లబ్ధిదారుల్లో 120 మంది ఇప్పటికే తమ వాటా ధనాన్ని డీడీ రూపంలో చె ల్లించారు. వీరికి నాలుగైదు రోజుల్లో సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తాం. గొల్ల,కురుమలకు 75శాతం సబ్సిడీపై రెం డో విడత గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో 2.13కోట్ల ఉచిత చేపపిల్లలను వదలాల్సి ఉండగా ఇప్పటి వరకు 54లక్షల చేపపిల్లలను వదలటం జరిగింది. మిగతా చేపపిల్లలను కూడా సాధ్యమైనంత త్వరలో రిజర్వాయర్లు, చెరువుల్లో వదిలే పనిలో మత్స్యశాఖ అధికారులు ఉన్నారు.

వైద్యసేవలు విస్తృతం..

వెనకబడిన ప్రాంతం కావటం వల్ల జిల్లాలో వైద్యసేవలను విస్తృతం చేస్తాం. ఏజెన్సీలో డాక్టర్, వైద్య సిబ్బంది గాని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు రెగ్యులర్‌గా చేయాలని ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభు త్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా కేసీఆర్ కిట్‌ను సమర్ధవంతంగా అమలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ను ఆదేశించాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై ప్ర త్యేక దృష్టి సారిస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు పని దినాల్లో ఖచ్చితంగా నిర్ధేశిత వేళల ప్రకారం విధులకు హాజరుకావాలి. హాస్టల్, గురుకులాల వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. రెవెన్యూతో పాటు ఇతర శాఖల అధికారు లు, ఉద్యోగులందరు కూడా హెడ్‌క్వార్టర్ మెయింటెన్ చేయాలి. రహదారుల కనెక్టివిటీ లేని గ్రామాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటా. పలిమెల మండలంలో వాగులపై చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తయ్యేలా సంబంధిత ఇంజనీర్లకు చెబుతాను. క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటాను. ఆకస్మిక తనిఖీలతో అధికారులు, ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తా.

129
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles