కొనసాగుతున్న కంటి వెలుగు


Wed,September 5, 2018 12:42 AM

ములుగుటౌన్ : పట్టణకేంద్రంలోని పంచాయతీ ఆవరణలో ప్రజలకు, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు వైద్యాధికారి విచిత్ర ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్విహించారు. మొత్తం 269 మందికి పరీక్షలు నిర్వహించి 65 మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 37మందిని ఆపరేషన్‌ల కోసం వరంగల్ కంటి దవాఖానకు రెఫర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
భూపాలపల్లి టౌన్ : కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గణపతి ప్రజలను కోరారు. పట్టణంలోని గాంధీనగర్‌లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరంలో కంటి పరీక్షలు చేసుకుని వైద్యులతో మాట్లాడారు. కంటి పరీక్షలు చేసుకున్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, శ్రీనాథ్, సీహెచ్‌ఓ రాజయ్య, హెల్త్ అసిస్టెంట్ గోపి, టీఆర్‌ఎస్ నాయకులు కార్తీక్, సురేశ్ పాల్గొన్నారు.
గణపురం : మండల పరిధిలో గణపురం, చెల్పూర్ కంటి వెలుగు శిబిరాలకు ప్రజల తరలివచ్చారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంతో142 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 75 మందికి కళ్లజోళ్లను అందజేశారు. చెల్పూర్ కేంద్రంలో 183మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.ఇందులో 35 మందికి కళ్లజోళ్లను అందజేశారు.పలువురుని శస్త్ర చికిత్స కోసం ఉమ్మడి జిల్లా వరంగల్ కంటి వైద్యశాలలకు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ మెడికల్ ఆఫీసర్ మహబూబ్‌పాషా, వైద్యులు తనూజరాణి, భాస్కర్ పాల్గొన్నారు.

భూపాలపల్లి, నమస్తేతెలంగాణ: చిట్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 152 మం దికి పరీక్షలు నిర్వహించి, 28 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 18 మందికి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. 16 మందిని కంటి శుక్లాల ఆపరేషన్ల కోసం పే ర్లు నమోదు చేసినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో క్యాంపు ఇన్‌చారి ్జవైద్యులు రవి, జయపాల్, కంటి వైద్యనిపుణులు తిరుపతిరావు పాల్గొన్నారు.
కాటారం : కాటారం మండలకే ంద్రంలోని పీహెచ్‌సీలో, మల్హర్ మండలంలోని తాడిచెర్ల పీహెచ్‌సీలో కంటి వెలుగు శిబిరం కొనసాగుతుంది. కాటారం పీహెచ్‌సీలో గారెపల్లి గ్రామానికి చెందిన పలువురు పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం 169 మందికి పైగా పరీక్షలు చేశామని, 64 మందికి కంటి అద్దాలు అందజేశామని, మరో 43 మందికి కంటి అద్దాల తయారీ కోసం ఆర్డర్ ఇచ్చామని తెలిపారు.
మహాముత్తారం : మండలంలోని యామన్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన శిబిరంలో 126 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యుడు గోపినాథ్ తెలిపారు. 30 మందికి కంటి అద్దాలు అందించామని, 13 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశామన్నారు. 17 మందిని కంటి ఆపరేషన్ అవసరం తెలిపారు. నిపుణుడు డాక్టర్ అమర్‌నాథ్ తెలిపారు.

ఏటూరునాగారం: మండలంలోని రాంనగర్ శిబిరంలో 172 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 80 మందికి కంటి అద్దాలు అందచేశారు. 14 మందిని శస్త్రచికిత్సం కోసం రెఫర్ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి అభినందన్ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి : మండలంలోని వీరాపురంలో వైద్యాధికారి సృజన్ ఆధ్వర్యంలో పరిక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందించారు. అవసరమైన వారిని కంటి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. మొత్తం 93 మందికి కంటి పరిక్షలు నిర్వహించి అద్దాలను పంపిణి చేసినట్లు వైద్యాధికారి సృజన్ తెలిపారు.

గోవిందరావుపేట : మండలంలోని రాఘవపట్నంలో కంటివెలుగు ఇన్‌చార్జి కుమారస్వామి ఆధ్వర్యంలో 121 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 55 మందికి కంటి అద్దాలు అందజేశారు. మంగళవారంతో రాఘవపట్నంలో కంటివెలుగు కార్యక్రమం పూర్తయిందని, నేటి నుంచి చల్వాయి గ్రామంలో ప్రారంభించనున్నట్లు కుమారస్వామి తెలిపారు.
వెంకటాపురం(నూగూరు) : మండల పరిధిలోని నూగూరులో సుమారు 163 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నరహరి, రామచందర్, హెచ్‌ఈవో హరికృష పాల్గొన్నారు.
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 4 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జిల్లాలోని పద్దెనిమిది కంటి వెలుగు కేంద్రాల్లో 21 బృందాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కాగా మంగళవారం జిల్లాలో గల 18 కేంద్రాల్లో 3143 మంది కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్నారు. 862 మందికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అద్దాలను పంపిణీ చేశారు. అలాగే 322 మందిని శస్త్ర చికిత్సల నిమిత్తం వరంగల్‌లోని కంటి దవాఖానలకు రెఫర్ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 36544 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 9928 మందికి అద్దాల పంపిణీ జరుగగా, 5063 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం రెఫర్ చేశారు.

కంటి వెలుగు శిబిరాల్లో తనిఖీలు
మంగపేట : మండలంలోని రెండు పీహెచ్‌సీలు, బోరనర్సాపురం కంటి వెలుగు శిబిరాలను మంగళవారం నాన్ కమ్యూనికేబుల్ డీసీజేస్(ఎన్‌సీడీ) రాష్ట్ర కోఅర్డినేటర్ ఎం జగన్నాథరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం అధికారి జేవీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. బోరునర్సాపురం శిబిరంలో కంటి వెలుగు డ్యూటీ వైద్యురాలు మంజుల, మరో హెల్త్ అసిస్టెంట్ మోతీలాల్ 11:30 గంటలు దాటుతున్నా విధులకు హాజరు కాని విషయాన్ని గుర్తించారు. శిబిరంలో కౌంటర్ల ఏర్పాటు సక్రమంగా లేని వైనాన్ని గుర్తించి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యకం చేశారు.. నిబంధనల ప్రకారం మార్పులు చేపట్టాలన్నారు. లేని పక్షాన క్రమశిక్షణా చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం మంగపేట పీహెచ్‌సీ తనిఖీ చేశారు. ఇక్కడ ముగ్గురు వైద్యులకు గానూ ఒక్కరే విధుల్లో ఉన్న విషయాన్ని గుర్తించారు. ప్రతీ రోజుకు సంబంధించిన ఓపీ వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదు చేయడం లేదని సిబ్బందిని మందలించారు. అభివృద్ది నిధులుండగా కనీసం దవాఖాన పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టక పోవడంపై ఆ సహనం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యాలపై తదుపరి చర్యల నిమిత్తం కలెక్టర్‌కు నివేదక సమర్పించనున్నట్లు లిపారు.

రేపటి నుంచి సీఆర్‌ఎం బృందం పర్యటన
ఆరు నుంచి పదకొండు వరకు జిల్లాలో కామన్ రివ్యూ మిషన్ బృందం పర్యటించనున్నట్లు ఎన్‌సీడీ రాష్ట్ర కోఅర్డినేటర్ జగన్నాథరెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న 115 జిల్లాల్లో నుంచి రాష్ట్రంలో ఈ సారి జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాను జాతీయ ఆరోగ్య మిషన్ వారు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ బృందం పర్యటించాక వీరి సిఫార్సు మేరకు ఈ జిల్లాల్లో వైద్య సేవలు మరింత మెరుగు పరచడానికకి అదనపు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు.

ఎన్‌సీడీ వైద్యకేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
వైద్యుల పనితీరు పరిశీలన
భూపాలపల్లి, నమస్తేతెలంగాణ: చిట్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఎ న్‌సీడీ వైద్యకేందాన్ని మంగళవారం వైద్యవిధానపరిషత్ రాష్ట్రప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరినా థ్, ఎన్‌సీడీ అడిషనల్ డైరెక్టర్ కృష్ణారావు పరిశీలించారు. దవాఖానలో పరిస్థితులను తెలుసుకున్నారు. రిజిష్టర్లను వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. దవాఖాన పరిధిలోని 7 పీహెచ్‌సీల నుంచి అవసరమున్న రోగులను చిట్యాల దవాఖానలో పరీక్షలు చేస్తున్నారు. దవాఖానలో ఎన్‌సీడీకి సంబంధించిన బీపీ, మధుమేహం, షుగర్, క్యాన్సర్ తదితర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు ఏ ర్పాట్లను పరిశీలించి వెళ్లారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వోఅప్పయ్య, డీసీహెచ్‌ఎస్ గో పాల్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ లలితాదేవి, వైద్యులు రవిప్రవీణ్‌రెడ్డి, ఫార్మసిస్టు మల్లికార్జున్, హెడ్‌నర్సు రాణి పాల్గొన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...