రూ.41వేల కోట్లతో పథకాల అమలు


Wed,September 5, 2018 12:42 AM

ఎంపీ సీతారాంనాయక్
వెంకటాపూర్, సెప్టెంబర్ 04 : బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.41వేలకోట్లతో 41పథకాల అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మానుకోట ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని మల్లయ్యపల్లి గ్రామలో లంబాడీలు కులదైవమైన శీత్లా భవానీ పండుగకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 70ఏళ్ల చరిత్రలో నీళ్లు, నిధు లు, ఉద్యోగాల కోసం తపిస్తున్న ప్రజలకు గత ప్రభుత్వాలు చేసింది శూన్యమని అ న్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రస్తుతం 36లక్షల ఎకరాలకు నీరందించేందుకు భక్తరామదాసు, కాళేశ్వరంలో ప్రాజెక్టులతో సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నిధుల విషయానికి వస్తే సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు 40శాతం తెలంగాణకు, 60శా తం ఆంధ్రకు వాటా ఇచ్చేవారని, అప్పుడు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగకపోయేదన్నారు. ప్రస్తుతం 7జోన్లు తెలంగాణకు వచ్చే విధంగా రాష్ట్రపతిని ఒప్పించి తెచ్చిన మహనీయుడని కొనియాడారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే గుణం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, అలాంటి బుద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన దుయ్యపట్టారు. కేసీఆర్ రాజకీయ పరిణతి తెలిసిన వ్యక్తి అని పార్లమెంటులో దేశ ప్రధాని మంత్రి అన్నాడని ఆయన గుర్తు చేశారు. ప్రగతి నివేదన సభకు సీఎం అనుకున్నదానికంటే ఊహించనంత జనం తరలివచ్చారని అన్నారు. సీఎం ఎవరినో విమర్శించేందుకు సభ పెట్టలేదని, దమ్ముంటే అలాంటి సభ పెట్టి ప్రజలను రప్పించాలని తీవ్రస్థాయిలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రైతు బంధు, కంటి వెలుగు దేశంలో అంతుచిక్కని పథకాలనీ, అందుకు సీఎంను అన్ని దేశాలు, రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ టీఆర్‌ఎస్ గద్దెనెక్కడం ఖాయమన్నారు. సమావేశంలో నాయకులు జాటోత్ జగ్‌రాంనాయక్, జాటోత్ దేవేందర్, ఆలీనాయక్, రాజునాయక్, సమ్మయ్య, స్వామి, వాలియా, ప్రతాప్, బల్‌రాం, అంతయ్య, జాటోత్ సమ్మయ్య, శర్వన్, కిషన్‌నాయక్, సారయ్య పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...