డిప్యూటీ సీఎం, మంత్రిని కలిసిన బిల్ట్ కార్మిక నాయకులు


Wed,September 5, 2018 12:41 AM

మంగపేట, సెప్టెంబర్ 04 : కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ సమస్యపై కార్మిక జేఏసీ నాయకులు మంగళవారం సాయం త్రం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి అజ్మీరా చం దూలాల్‌ను కలిశారు. ఉత్పత్తులు ఆగిన ఫ్యా క్టరీ సమస్యతో పాటుగా, కార్మికుల పెండింగ్ వేతనాల విషయం వారి వద్ద ప్రస్తావించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. బిల్ట్ పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.350 కోట్ల చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ద్వారా తెలిసినట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో కూడా విడుదల కాబోతుందని వారు చెప్పారు.

మంత్రులను కలిసిన వారిలో జేఏసీ నాయకులు కూర్బాన్‌అలీ, పప్పు వెంకట్‌రెడ్డి, వడ్డెబోయిన శ్రీనివాసులు, పాకనాటి వెంకట్‌రెడ్డి, రాంచందర్, వంగేటి వెంకట్‌రెడ్డి, వీ రవిమూర్తి, మునిగాల వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి, శర్మ, నర్సింహరావు ఉన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...