అటవీ సిబ్బంది అదుపులో కూలీ


Wed,September 5, 2018 12:41 AM

అక్రమంగా టేకు చెట్లు నరుకుతుండగా పట్టుకున్న అధికారులు
గోవిందరావుపేట, సెప్టెంబర్ 04 : పస్రా వైల్డ్‌లైఫ్ అధికారులు అటవీప్రాంతంలో చెట్లు నరుకుతున్న ఓ కూలీని అదుపులోకి తీసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ నెల 1వ తేదీన పస్రా వైల్డ్‌లైఫ్ రేంజ్ పరిధిలోని అటవీప్రాంతంలో అక్రమంగా టేకు చెట్లు నరుకుతున్నట్లు అందిన సమాచారం మేరకు రేంజ్ అధికారిణి శిరీష ఆదేశాలతో అటవీసిబ్బంది మేడారం- తాడ్వాయిల మధ్య చెట్లు నరుకుతు న్న ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే చెట్లు నరుకుతున్న నలుగురు అటవీసిబ్బందిని గమనించారు. వారిలో ముగ్గురు పారిపోగా, ఒక కూలీ వారి చేతికి చిక్కారు. అయితే అదే సమయంలో పస్రా వైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారిణి శిరీష శిక్షణ కోసం బయటిప్రాంతానికి వెళ్లి ఉండడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఆమె మరుసటి రోజు వచ్చిన త ర్వాత రెండు రోజులుగా కాటాపూర్‌కు చెందిన కూలీ సు రేందర్‌ను విచారించగా పలువిషయాలు వెలుగులోకి వ చ్చినట్లు సమాచారం. ఏటూరునాగారం మండలానికి చెం దిన ఓ వ్యక్తి తమకు చెట్లు కొట్టేందుకు కూలీకి తీసుకువచ్చారని, దీని వెనుక మరో స్మగ్లర్ ఉన్నట్లు విచారణలో తె లిపినట్లు సమాచారం. ఈ విషయమై రేంజర్ శిరీషను వి వరణ కోరగా కూలీ తమ అదుపులో ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. అతన్ని విచారించి ఉన్నతాధికారులకు తెలిపి, వారి సూచనల మేరకు అతని వెనుక ఉన్న స్మగ్లర్ల గురించి విచారించనున్నట్లు ఆమె వివరించారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...