బోనాలు.. పెళ్లిల్లు..

Wed,September 5, 2018 12:41 AM

-జోరుగా మద్యం అమ్మకాలు..
-వైన్‌షాప్‌లకు ఫుల్ గిరాకీ..
-నాలుగు రోజుల్లో రూ.38.23 కోట్లు
సుబేదారి,సెప్టెంబర్ 04: బోనాలు, పెళ్లిళ్ల సీజన్ అబ్కారీ శాఖకు కలిసివచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే బోనాల పండుగకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత ఉంది. వర్షాలు సంవృద్ధిగా కురియాలి, పంటలు బాగా పండాలి,ఇంటిల్లిపాది సల్లంగుండాలని పోచమ్మ తల్లికి కోటి మొక్కులు మొక్కె పండుగ ఇది. బెల్లం అన్నంతో నైవేద్యం సమర్పించి, కొత్త బట్టలు పెట్టి కోడి, యాటలను బలివ్వడం ఆనవాయితీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వా రం రోజుల నుంచి ప్రతీ ఇంట్లో బోనాల సంబురమే. ఏ ఇంట్లో చూసినా చికెన్, మటన్, మద్యం వాసనే. రాష్ట్రంలో అన్ని వర్గా ల ప్రజలు మాస్‌గా జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. బోనాల పండుగకు తోడు ఆగస్టు 29నుంచి ఈనెల 2వ తేదీ వరకు శుభాకార్యాలు, పెండ్లి ముహూర్తాలు రావడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. పండుగలకే కాకుండా, వివాహాది శుభకార్యాలకు మద్యం తాగడం ప్రస్తుత రోజుల్లో పరిపాటిగా మారిం ది. దీంతో మద్యం షాపులకు మందుబాబుల తాకిడి పెరిగింది. వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో అంచనాలకు మించి అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో సేల్స్ కావడానికి ప్రధానంగా బో నాల పండుగ, పెళ్లిల్లేనని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.

నాలుగు రోజుల్లో రూ.38.23 కోట్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లో మద్యం షాప్‌లకు గిరాకీ పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం 265 వైన్స్‌షాప్‌లు, 103 బార్లు ఉన్నాయి. వీటినుంచి సాధారణంగా రోజుకు రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు ఆదా యం వస్తుంది. అయితే బోనాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్సైజ్‌శాఖకు ఘననీయంగా ఆదాయం పెరిగింది. 29 తేదీన రూ. 9.7కోట్లు, 30న 9.91 కోట్లు, 31న రూ.11.89 కోట్ల ఆదాయం రాగా.., సెప్టెంబర్ 1వ తేదీ శనివారం రూ.6.73 కోట్ల ఆదాయం వచ్చింది. 2న ఆదివారం బోనాలకు శుభదినం కావడంతో సుమారుగా రూ.9 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు రూ.38.23కోట్ల ఆదాయం వచ్చింది.

101
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles