ఐటీడీఏ క్వార్టర్స్‌లో ఎక్సైజ్ స్టేషన్


Thu,January 12, 2017 01:34 AM

-భర్తీకి నోచుకోని రెండు ఎస్సై, సిబ్బంది పోస్టులు
-పర్యవేక్షణ కరువు..
-జోరుగా గుడుంబా, గుట్కా అమ్మకాలు
-శిథిలావస్థలో ఆఫీస్
-అధికారుల ఇబ్బందులు

ఏటూరునాగారం, జనవరి 11: ఎక్సైజ్ స్టేషన్‌కు సొంత భవనం లేకపోవడంతో దశాబ్దకాలంగా ఐటీడీఏ క్వార్టర్స్‌లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం అది కాస్త శిధిలావస్థకు చేరుకుంది. ఇరు కు గదులతో అధికారులకు ఇబ్బందు లు తప్పడం లేదు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలకు సంబంధిం చిన ఎక్సైజ్ స్టేషన్ ఏటూరునాగారంలోనే ఉంది. జిల్లాల పునర్విభజనకు ముందు ఏటూరునాగారం, మంగపేట మండలాలు ఉండగా పునర్విభజన అ నంతరం కొత్తగా ఏర్పాటు చేసిన కన్నాయిగూడెం మండలంతో పాటు ఖమ్మం జిల్లా నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిపిన వాజేడు, వెంకటాపు రం మండలాలను ఏటూరునాగారం ఎ క్సైజ్ కార్యాలయం పరిధిలోకి చేర్చారు. వెంకటాపురంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయాన్ని కాటారానికి తరలించారు. రెండు మండలాలకు సంబంధించిన స్టేషన్ ఇప్పుడు ఐదు మండలాలకు వి స్తరించింది. ఇక ఎక్సైజ్ స్టేషన్‌లో ఉన్న గదుల్లో రెండింటిని స్వాధీనం చేసుకు న్న ద్విచక్రవాహనాలను కేటాయించా రు. ఓ గదిలో బెల్లాన్ని నిల్వ చేశారు. సీఐ, ఎస్సైలకు కేటాయించిన రెండు గ దులు ఇరుకుగా ఉండడంతోపాటు భ వనం శిథిలావస్థకు చేరుకుంది. అరకొర వసతులతో అధికారులు, సిబ్బంది ఇ బ్బందులు పడుతున్నారు. ఎక్సైజ్ స్టేష న్ పరిధిలో ఐదు మండలాలు రాగా , మొత్తం పది వరకు మద్యం షాపులు ఉన్నాయి. ఆదాయం బాగానే వస్తున్పప్పటికీ కార్యాలయం మాత్రం సొంత భవనానికి నోచుకోవడం లేదు. విద్యుత్ వైరింగ్ సక్రమంగా లేకపోవడంతో కంప్యూటర్ కోసం అమర్చుకున్న వైర్లు కూడా కాలిపోయాయి. దీంతో కంప్యూటర్ పనులు కూడా ప్రైవేటుగానే చేయిస్తున్నారనే తెలుస్తోంది.

భర్తీకి నోచుకోని ఎస్సై పోస్టులు..


ఐదు మండలాల్లో కల్తీ మద్యం, గుడుంబా అమ్మకాలతో పాటు ఇతర అక్రమాలను అరికట్టేందుకు అవసరమై న సిబ్బంది ఎక్సైజ్ స్టేషన్‌లో ఉండాల్సి ఉంది. గతంలో సీఐ, ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, తొమ్మిది కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం రెండు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై బదిలీ అయి ఏ డాది కావస్తున్నా ఎవరినీ నియమించలేదు. మరో ఎస్సైని ఇక్కడ నియమించకుండా డిప్యూటేషన్‌పై రెండు, మూ డు నెలలు కేటాయిస్తున్నారు. కాగా గత నాలుగు రోజులుగా ఇక్కడ ఎస్సై లేన ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జిల్లా ల పునర్విభజన తర్వాత వెంకటాపురంలో ఉన్న స్టేషన్‌ను ఎత్తివేసి ఏటూరునాగారం స్టేషన్‌కు మరో ఎస్సై పోస్టును మంజూరు చేశారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్ల పోస్టులను కూడా మంజూరు చేశారు. కాగా, కొత్తగా మంజూరైన ఎస్సై పోస్టుతో పాటు పాత పోస్టు కూ డా భర్తీకి నోచుకోలేదు. ఎస్సైలు, సి బ్బంది అరకొరగా ఉండడంతో గ్రా మా ల్లో దాడుల నిర్వహణ కూడా సన్నగిల్లింది. దీంతో మద్యం షాపుల అమ్మకాలతో పాటు గుడుంబా, గుట్కా తదితర అక్రమ వ్యాపారాలు జోరుగా పెరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. రెండు పోస్టులు ఖాళీగా ఉన్న ఈ స్టేషన్‌లో ఒ క్క ఎస్సైనీ నియమించడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తక్షణమే ఎస్సై పోస్టులు, సిబ్బందిని భర్తీ చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

51
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS