కాళేశ్వరంలో సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ పూజలు

Thu,January 12, 2017 01:31 AM

కాళేశ్వరం, జనవరి 11 : సీఆర్‌పీఎఫ్ 58వ బెటాలియన్ కమాండెంట్ విజయ్‌కుమార్ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామినిదర్శించుకున్నారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా కాళేశ్వరానికి రాగా, ఆలయ ఈవో హరిప్రకాశ్ ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసి, అర్చకులు కృష్ణమూర్తి శర్మ, నగేశ్ శర్మ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కమాండెంట్‌ను స్వామివారి శేష వస్ర్తాలతో సన్మానించి, ఆలయ చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట అసిస్టెంట్ కమాండెంట్ పవన్ యాదవ్, కాళేశ్వరం ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ కిషన్ ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...