గ్రామాల్లో పర్యటించిన మలేరియా బృందం


Thu,January 12, 2017 01:31 AM

తాడ్వాయి, జనవరి11 : మండలంలోని నర్సాపురం, కామారం, రంగాపురం గ్రామాల్లో బుధవారం మలేరియా(సెంట్రల్ ఎంటామాలాజికల్) బృందం పర్యటించింది. మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న కారణంగా ఆయా గ్రామాల్లో ఏడుగురు సభ్యులు రెండు టీంలుగా విడిపోయి ప్రతి ఇంటికీ తిరిగి, మలేరియా కేసులు ఏమైనా ఉన్నాయా? వైద్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న దోమ తెరలు అందుతున్నాయా? లేదా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల రక్త నమూనాలను సేకరించారు. ఎపిడాలజి టీమ్, తినాథ్, హరి, రామయ్య, ఎంటామాలజీ టీమ్, బీఎస్ మహారాణా, మహేశ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS