ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి


Thu,January 12, 2017 01:30 AM

-అధికారుల తీరుపై ఆగ్రహం
-ఉపాధి సిబ్బందిపై సస్సెన్షన్ వేటు
-ఎంపీడీవోకు మెమో జారీకి ఆదేశం
-అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-స్పీకర్‌తో కలిసి మంత్రి జూపల్లి పర్యటన

రేగొండ/మొగుళ్లపల్లి/చిట్యాల, జనవరి 11 : జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పని కల్పించాలని గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జాపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన స్పీకర్ సిరికొండ మధుసూదన్‌రావుతో కలిసి భూపాలపల్లి డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశా రు. రేగొండ మండలంలోని రామన్నగూడెం, భాగిర్ధిపేట గ్రామా ల్లో పర్యటించి ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన ఫాంపాండ్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామా ల్లో మహిళా సమాఖ్య పనితీరు, ఉపాధిహామీ పనుల అమలుపై కూలీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ రామన్నగూడెంలో 744కుటుంబాలకుగాను 724జాబుకార్డులు ఉండటంతో 2015-2016 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.1.39కోట్ల14వేలు కేటా యించిందన్నా రు. కేవలం 44కుటుంబాలకే 100రోజలు పనికల్పించి రూ. 24లక్షలు మాత్రమే ఖర్చు చేయడంపై మండిపడ్డారు. భాగిర్ధిపేటలో రూ.2కోట్ల40లక్షలు కేటాయించగా నాలుగు కుటుంబాల కు మాత్రమే 100రోజలు పని కల్పించి రూ. 24లక్షలు ఖర్చు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్వక్తం చేశారు. ఎంపీడీవోకు చార్జీమెమో, ఉపాధి హామీ పథకం ఏపీవో టెక్నికల్, ఫిల్డ్ ఆసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు సూచించారు. మార్చి 31వరకు అన్ని గ్రామాల్లో జాబు కార్డు కల్గిన కుటుంబాలకు 100రోజుల పని కల్పించాలన్నారు. లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవన్నారు. అలాగే గ్రామాల్లో ఫాంపాండ్స్ నిర్మించుకుని భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ మురళి, ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ మురళి, ఎంపీపీ ఈర్ల సదానందం,సర్పంచ్‌లు లెంకల రత్నమాల,సంధ్య, నాయకుల మోడెం ఉమేష్‌గౌడ్, రాజేశ్వర్‌రావు, పున్నం రవి, మైస భిక్షపతి తదితరులు ఉన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..


మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలో రూ.1.26 కో ట్లతో నిర్మించిన మోడల్ స్కూల్‌లోని హాస్టల్ భవనాన్ని స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. అలాగే రూ.38లక్షలతో వాటర్ పైప్‌లైన్ పనులకు, మండల కేంద్రంలో రూ.40లక్షలతో సీసీ రోడ్ల పనులకు, రూ.19కోట్లతో నిర్మించతలపెట్టిన మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్‌లో స్పీకర్ విద్యార్థులకు ప్రశ్నలు వేసి సరిగా సమాధానాలు చెప్పిన వారికి ప్రశ్నకు రూ.200 ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు.

చిట్యాల మండలంలోని జడల్‌పేట శివారు కల్వర్టువద్ద వంతెన ని ర్మాణానికి బుధవారం స్పీకర్ శం కుస్థాపన చేశారు. రూ.8కోట్లతో వంతెన నిర్మాణంతోపాటు, గరిమిల్లపల్లి నుంచి, మోరంచకు డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ.45కోట్లు, లింగాలక్రాస్ నుంచి ఒడితలకు రూ.10కోట్లు మంజూరైనట్లు ఆ యన తెలిపారు. పెద్దపెల్లిజిల్లా ము త్తారం మండలం ఒడేడు, టేకుమట్ల మండలం గరిమిల్లపల్లి మధ్యగల మానేరువాగులో రూ.47కోట్లతో హైలెవల్‌వంతెన నిర్మా ణం జరుగుతుందన్నారు. టేకుమట్ల మండల ప్రజలు చిట్యాలకు వెళ్లకుండా శాంతినగర్ నుంచి జడల్‌పేట క్రాస్‌కు నేరుగా వచ్చి, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ సెక్రటరీ భట్టుమల్లు, జడ్పీటీసీ లు సంపెల్లి వసంత,కాట్రేవుల సాయిలు, ఎంపీపీ నల్లభీం వి జయలక్ష్మి, సర్పంచ్‌లు బద్ధం జయపాల్‌రెడ్డి, బొట్ల మొగిళి, ఎం పీటీసీ జమలాపురం లక్ష్మీ, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో అశో క్‌కుమార్, డీఈవో సహదేవుడు, ఎంఈవో ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, నల్లభీం మల్లయ్య, చదువు అన్నారెడ్డి, కొడారి రమేశ్, ఆర్‌అండ్‌బీ డీఈ రమేశ్, సింగిల్‌విండో చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, నాయకులు కత్తి సంపత్, జన్నె యుగేందర్, బొడ్డు సదానందం, జాలిగపు కిష్టయ్య, పుల్లూరి సతీష్, దొడ్డె శంకర్, మన్నెం శ్రీనివాస్‌రావు, నోముల నాగరాజు, ఏరుకొండ గణపతి, ముక్కెర రమేశ్ పాల్గొన్నారు.

34
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS