రహదారుల అభివృద్ధే లక్ష్యం.. పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్


Thu,January 12, 2017 01:30 AM

భూపాలపల్లిటౌన్, జనవరి 11 : భూపాలపల్లి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధే లక్ష్యమని స్పీకర్ సిరికొం డ మధుసూదనాచారి అన్నారు. బు ధవారం ఆయన భూపాలపల్లి మండలంలోని కొత్తపల్లి (ఎస్‌ఎం) గ్రామ శివారు లో గల కొత్తపల్లి మాటుపై రూ. 4 కోట్ల తో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ నియోజకవర్గంలో వంతెన లు లేని వాగులు, వంకలు, ఒర్రెలు, కా లువలు ఉండరాదన్నారు. ప్రతి గ్రా మానికి రహదారి ఉండాలని, అలాగే ప్రతి గ్రామానికి బస్సు నడవాలనేదే తన ల క్ష్యమని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆ ర్టీసీ డిపో సమీపంలో నిర్మించిన జయశంకర్ స్మారక బృందావనంను స్పీకర్ సి రికొండ మధుసూదనాచారి, ఎంపీ సీతారాంనాయక్, మంత్రి జూపల్లి కృష్ణారావు లు పరిశీలించారు. కార్యక్రమంలో ఎం పీపీ కళ్లెపు రఘుపతిరావు, జడ్పీటీసీ మీ రాభాయి, ఆర్‌అండ్‌బీ డీఈ రమేశ్, స ర్పంచ్ లావణ్య, నగర చైర్‌పర్సన్ బం డారి సంపూర్ణ, వార్డు కౌన్సిలర్ బేతోజు వజ్రమణిచారి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, మాజీ జ డ్పీటీసీ కంకటి రాజవీరు, నాయకులు పాడి ప్రతాప్‌రెడ్డి, లకిడె వెంకన్న, తరాల నర్సింగం, ముత్యాల చక్రపాణి, మోతె వైకుంఠం, మోతె హరినాథ్, జాలిగపు రవి, నాలిక రవి, ఆరెల్లి మూర్తి, జాలిగపు కిష్టయ్య పాల్గొన్నారు.

బ్రిడ్జిల నిర్మాణాలకు శంకుస్థాపన..


గణపురం మండలం గణపసముద్రం వద్ద మత్తడిపై హైలెవల్ బ్రిడ్జి ని ర్మాణానికి రూ.1.60 కోట్లతో స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. ధర్మారావుపేట వద్ద గల మోరంచపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.49 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గణపురం ఎంపీపీ శార ద, జడ్పీటీసీ శివశంకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్‌రావు, ఆర్ అండ్ బీ డీఈ రమేశ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, మాజీ మండల అధ్యక్షుడు గంగాధర్, నాయకులు బైరగా ని కుమా రస్వామి, ఏ.మల్లారెడ్డి పాల్గొన్నారు.

63
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS