రైతులకు 24గంటల విద్యుత్...

Thu,January 12, 2017 01:29 AM

-రూ. 2500 కోట్లతో 600ల సబ్‌స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్లు నిర్మించాం
-భూపాల్‌నగర్‌లో రూ. 2.50 కోట్లతో సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన మ్ంరత్రులు జగదీష్‌రెడ్డి, చందూలాల్

ములుగు, నమస్తే తెలంగాణ, జనవరి 11 : రానున్న రోజుల్లో వ్యవసాయానికి రై తుల కోసం 24 గంటల విద్యుత్‌ను అం దించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ, ఎస్సీ అభివృద్ధి శా ఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నా రు. బుధవారం ములుగు మండలం భూ పాల్‌నగర్ గ్రామపంచాయతీలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ వి ద్యుత్ సబ్‌స్టేషన్‌ను గిరిజన సంక్షేమ, ప ర్యాటక సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు మంత్రులకు గ్రా మ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఒ క్కో సీసీ రోడ్డుకు రూ.5లక్షలతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను మంత్రులు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని నౌశ్యతండా, శివతండా, ఒంటిగుడిసెతం డా, రాంనగర్ తండాలలో సీసీ రోడ్లను ప్రారంభించిన అనంతరం భూపాల్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వస్తే కరెంట్ లేక తెలంగాణ అంధకారం అవుతుందని నాడు సమైక్యవాదులు చేసిన దుష్ప్రచారాన్ని తి ప్పికొడుతూ రెండున్నరేళ్లలోనే గృహ, పరిశ్రమలకు 24గంటలు రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నా రు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతులకు వి ద్యుత్‌నందించడానికి దేశంలో ఏ రాష్ట్రం లో మిగులు విద్యుత్ ఉన్నా కొనుగోలు చే సి సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాను న్న రోజుల్లో రైతులకు 24గంటల విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.2500 కోట్లు ఖర్చు చేసి 600 విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ైలెన్లు, మెయిన్‌లైన్లు నిర్మించామ ని, లో వోల్టేజీ సమస్యను అధిగమించామ ని తెలిపారు. అర్హులందరికీ డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేసి నిర్మించడం జ రుగుతుందని, పూరి గుడిసెలలో ఉన్న వా రికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వచ్చే సంవత్సరం రెండు లక్షల ఇళ్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ రైతులకు వరం లాంటిదని అన్నారు.

తెలంగాణ రాకముందు భూపాల్‌నగర్ రైతులు వి ద్యుత్ కోసం సబ్‌స్టేషన్‌ను ముట్టడించడం, ఆందోళన చేసేవారని, రైతుల కష్టాలు గమనించి విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి భూపాల్‌నగర్‌లో సబ్‌స్టేషన్ మంజూరు చేశామన్నారు. అదేవిధంగా ములుగు మం డలం పత్తిపల్లి, వెంకటాపురం మండ లం కేశవాపు రం, గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో కొత్త సబ్‌స్టేషన్‌లు మంజూరు చేయాలని మంత్రి జగదీష్‌రెడ్డిని కోరారు. స్పందించిన మంత్రి సాధ్యాసాధ్యాలు పరిశీలించి సబ్‌స్టేషన్‌లు మంజూరు చేయాలని ట్రాన్స్-కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్‌రావును ఆదేశించారు. సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. జే సీ అమయ్‌కుమార్, సబ్ కలెక్టర్ వీపీ గౌతమ్, ట్రాన్స్-కో సీఎండీ నర్సింగరావు, ములుగు డీఈ మహేందర్, స్థానిక సర్పం చ్ విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభ న్, ఎంపీపీ భూక్య మంజుల, సింగిల్‌విం డో చైర్మన్ కిషన్‌నాయక్, ఎంపీటీసీలు రమణారెడ్డి, లింగంపల్లి సంపత్‌రావు, జా నమ్మ, జగనమ్మ, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు గట్టు మహేందర్, గట్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనగా పస్రా బాలాజీనాయక్ ఆధ్వర్యంలో ఎస్సైలు మల్లేశ్‌యాదవ్, పోగుల శ్రీకాంత్ బందోబస్తు నిర్వహించారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...