లక్నవరంలోకి దేవాదుల నీళ్లు..


Thu,January 12, 2017 01:28 AM

-365 రోజులూ సరస్సు నిండుకుండలా ఉండాలి
-మంత్రులు జగదీష్‌రెడ్డి, చందూలాల్
గోవిందరావుపేట, జనవరి 11 : తుపాకులగూడెం బ్యారేజీ నిర్మా ణం పూర్తికాగానే దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా లక్నవరం సరస్సులో కి నీటిని మళ్లించి 365రోజులూ సర స్సు నిండుకుండలా ఉం డేలా తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తోందని రా ష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి అజ్మీరా చందూలాల్‌లు అన్నారు. బుధవారం వారు మండలంలోని లక్నవరం సరస్సును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. లక్నవరం సరస్సు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు.

సమావేశానికి ముందు గా ఇరువురు మంత్రులు స్పీడ్‌బోటులో లక్నవరం సరస్సు అందాలను తిలకిస్తూ మంత్రముగ్ధులయ్యారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సూడి శ్రీనివాసరెడ్డి, నాయకులు దొడ్డిపల్లి రఘుపతి, అక్కల రవి, భూక్య సుమలత, సంసోతు రాజన్ననాయక్, భూక్య దేవా, అజ్మీరా సురేష్, నర్సింహనాయక్, మద్దినేని శ్రీనివాస్, జెట్టి సోమ య్య, లకావత్ చందూలాల్ ఉన్నారు. కాగా మంత్రుల బందోబస్తు కోసం ఓఎస్డీ రవీందర్‌రావు నేతృత్వంలో ఏటూరునాగారం సీఐ రఘుచందర్, ములుగు సీఐ శ్రీనివాసరావు, పస్రా సీఐ బాలాజీలతోపాటు పస్రా ఎస్సై రాందేనిస్వామి, తాడ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు, సీఆర్‌పీఎఫ్, సివిల్ పోలీసులు ఉన్నారు.

69
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS