పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం


Thu,January 12, 2017 01:27 AM

-ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలు..
-మంథని ఎమ్మెల్యే పుట్ట మధు

మహాముత్తారం, జనవరి 11: కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు.. కార్యకర్త కుటుంబానికి పెద్ద కొడుకు లాంటివాడు, నే టి కార్యకర్తలే, రేపు మంచి ఫలితాలు అనుభవించనున్నారని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. బుధవారం ఆయన మహాముత్తారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంఖుస్థాపనలు చేశారు. అనంతరం కోనంపేటలో మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు జాటోత్ రూపానాయక్ అధ్యక్షతన నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో రాక్షస పాలనను పారద్రోలిన ఘనత కార్యకర్తలకే దక్కిందన్నా రు. గత పాలకులు టీఆర్‌ఎస్ కార్యకర్తలను అనేక ఇబ్బందుల కు గురిచేసినా, ధైర్యంతో ముందుకు సాగిన కార్యకర్తలు రాక్షస పాలనుకు చమరగీతం పాడారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెనిఫెస్టోలో లేని పథకాలను ప్రవేశపెట్టి ప్రజల పక్షాన నిలిచిందన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా నిరుపేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా బోర్లగూడెంకు చెందిన 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే మధు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం


పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. బుధవారం ఆయన మహాముత్తారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకులు అటవీ గ్రామాల అభివృద్ధిని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాటారం నుంచి మేడారం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం జరగుతోందని, గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ రాజిరెడ్డి, కాటారం మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అర్జయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ మల్లయ్యగౌడ్, కో-ఆప్షన్ సభ్యులు సాబీర్‌బేగ్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రూపానాయక్, యూత్ అధ్యక్షుడు జంగు, మహిళ అధ్యక్షురాలు నజ్మాబేగం, తెలంగాణ జాగృతి మండలశాఖ అధ్యక్షుడు రవి, లింగమ్మ చారిటబుల్ ట్రస్టు డివిజన్ కో-ఆర్డినేటర్ రమేశ్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటయ్య, మైనారిటి నాయకుడు ఇంతియాజ్, సర్పంచ్‌లు అనసూర్య, శ్రీరాంనాయక్, రాజు, ప్రేమలత, సమ్మక్క, ఎంపీటీసీ రాముగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి, పంచాయత్‌రాజ్ డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓ భాస్కర్‌రావు, పీఆర్, ఐబీ ఏఈలు రవీందర్, రమేశ్, ఆయా గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

40
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS