సహకార ఆభివృద్ధికి కృషి


Thu,January 12, 2017 01:26 AM

డీసీసీబీ డైరెక్టర్ గూడపాటి శ్రీనివాసరావు
వెంకటాపురం(నూగూరు), జనవరి11 : జిల్లా కేంద్ర సహాకార బ్యాంక్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్, వెంకటాపురం పీఏసీఎస్ చైర్మన్ గూడపాటి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక రోడ్లు భవణాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.కోటి వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సొసైటీ బ్యాంక్ అధునీకరణకు రూ.10లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. సొసైటీ సంవత్సరానికి రూ.7కోట్ల లావాదేవీలను నిర్వహిస్తుందని, దీన్ని రూ.15కోట్ల లావాదేవీల ల క్ష్యంతో ముందుకు వెలతామని అన్నారు. రూ.5.20లక్షల వి లువైన సోలార్ పంపు సెట్లను అర్హులైన రైతులకు రూ. 2.4లక్షల సబ్సిడీతో ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే రైతులు రూ. లక్ష ముందుగా చెల్లించి మిగిలిన నగదును సులభవాయిదా పద్ధతుల ద్వారా చెల్లించుకోవచ్చన్నారు. మండల పరిధిలోని ఆలుబాక గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో శుద్ధ జల ప్లాంట్‌ను పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించనునన్నట్లు తెలిపారు.

43
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS