పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ


Thu,January 12, 2017 01:25 AM

తాడ్వాయి, జనవ రి11: మండలకేంద్రంలోని ప్రభు త్వ ప్రాథమిక ఆ రోగ్యకేంద్రాన్ని బు ధవారం జిల్లా వై ద్యాధికారి అల్లెం అప్పయ్య అకస్మికంగా సం దర్శించి తనిఖీలు నిర్వహించారు. మొదటగా నూతనంగా అస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేస్తున్న గార్డెన్ పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోకి వెళ్లి ఆపరేషన్ థియేటర్, వ్యాక్సిన్‌ల స్టోరేజ్ గదులను పరిశీలించారు. ఆస్పత్రిలో కాన్పులు మరింత పెంచేలా కృషి చేయాలని, వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఓపి రిజిష్టర్, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. మందుల నిల్వలు ఉండేలా చూసుకోవాలని, అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆయనవెంట వైద్యాధికారి కోరం క్రాంతికుమార్ ఉన్నారు.

30
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS