యాసంగి ఎవుసం సాగేదెట్లా?


Wed,January 11, 2017 02:09 AM
గోవిందరావుపేట, జనవరి 10 : ప్రధానమం త్రి నరేంద్రమోడీ పెద్ద నోట్లు రద్దు చేసి 60రోజులు దాటినా ప్రజలు, రైతుల కష్టాలు తీరడంలేదు. డ బ్బులు చేతికి అందకపోవడంతో యాసం గి సాగు చేసేందుకు రైతుల చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది. వానాకాలంలో వచ్చిన పంట ను అ మ్ముకున్న రైతుకు సమయానికి చేతికి డబ్బు లు అందక ఇబ్బందులు పడుతున్నారు. పనులకు కూ లీలను పిలిచినా వారికి వెంటనే డబ్బులు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నదన్నట్లుగా డబ్బులుండి కూడా పనులు చేసుకోలేని పరిస్థితిలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో యాసంగి ఎవుసం సాగేదెట్లా..? అని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. సన్న, చిన్నకారు రైతులు ఎకరం పొలం సాగు చే సుకుంటూ కూలీకి పోయేవారు కూడా నేడు ధా న్యం డబ్బుల కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.
బ్యాంకు తీయకముందే ఉ దయం 9గంటలకే రైతులు బారులు తీరుతున్నా రు.

వందలాది మంది క్యూలో నిలబడితే కొందరికి మాత్రమే రూ.3వేల నుంచి రూ.6వేల వరకు బ్యాంకు అధికారులు ఇస్తున్నారు. మధ్యాహ్నం వ రకే డబ్బులు అయిపోయాయంటూ నోక్యాష్ బో ర్డు పెడుతున్నారు. దీంతో కొందరు డబ్బులు అం దక వెనుతిరుగుతున్నారు. ఒకరైతుకు ధాన్యం డ బ్బులు సుమారు రూ.40వేలు వస్తే వాటి కోసం రోజూ క్యూలో ఉంటూ పదిరోజులు తీసుకోవాల్సి న పరిస్థితులు నెలకొన్నాయి. పనులు వదులుకుని వస్తున్నా డబ్బులు అందడంలేదు. మండలంలోని ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక్కటే ఉండడంతో మండలంలోని అన్ని గ్రామాలతోపాటు పక్క మండలాల రైతులు కూడా ఇదే బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్నారు.

ప్రైవేటు బ్యాంకులున్నా..


మండలంలోని పస్రాలో కాకతీయ గ్రామీణబ్యాంకు, కెనరాబ్యాంకు, చల్వాయిలో కోటక్‌మహీంద్రా బ్యాంకులు ఉన్నా ఆ బ్యాంకులలో రైతు ల ఖాతాలు చాలా తక్కువగా ఉన్నాయి. చల్వాయి లో కోటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నప్పటికీ ప్రజలకు, రైతులకు ఎలాంటి పంట రుణాలు ఇవ్వకపోవడంతో ఆ గ్రామ రైతులు కూడా గోవిందరావుపేటలోని ఎస్‌బీఐలో పంట రుణా లు తీసుకుం టూ తమ ఖాతాలను అక్కడే కొనసాగిస్తున్నారు. పస్రాలో ఉన్న కెనరా బ్యాంకు తాడ్వాయి మండలంలోని కాటాపూర్‌శాఖకు చెందిన బ్యాంకు కావడంతో మండలంలోని ఖాతాదారులు ఆ బ్యాంకులో తక్కువగా ఉన్నా రు. ఇటు గోవిందరావుపేట, అటు తాడ్వాయి మండలాలలోని ఎక్కువ గ్రామాలకు ఎస్‌బీఐనే ఎక్కువగా సేవలందిస్తోంది.

ధాన్యం డబ్బులు రూ.15కోట్లకు పైనే..


మండల రైతులు పండించిన ధాన్యం డబ్బు లు దాదాపు రూ.15 కోట్లకు పైగానే బ్యాంకు ల ద్వారా రైతులకు రావాల్సి ఉంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రైతు లు ధాన్యం అమ్మగా మండలం మొత్తంగా సు మారు రూ.15కోట్లకు పైగా ఎస్‌బీఐలోని రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఆ మేరకు ఎస్‌బీఐకి డబ్బులు రాకపోవడంతో సకాలంలో రైతు చేతికి డబ్బులు అందక కష్టాలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి గోవిందరావుపేటలోని ఎస్‌బీఐశాఖకు సరిపడా డబ్బు అందేలా చూడాలని కోరుతున్నారు.

41
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS