రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..


Wed,January 11, 2017 02:07 AM


మహదేవపూర్, జనవరి 10 : రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి భూసేకరణ చేపడితే చూస్తే ఊరుకునేది లేదని సీఎల్‌పీ నేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మహదేవపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మేడిగడ్డ బ్యారేజీ భూనిర్వాసితులకు మద్దతుగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు చేపట్టిన ఒక్కరోజు నిరసన దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. మేడిగడ్డ దిగువన భూములు కోల్పోయే అవకాశం ఉన్న భూనిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం ఎకరానికి రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాడేందుకు సిద్ధంగా ఉందన్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బలవంతపు భూసేకరణను వెంటనే విరమించుకోవాలని కోరారు. గ్రామ సభల్లో పూర్తి వివరాలను ప్రకటించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని సూచించారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ అడ్డూరి లక్ష్మణ్, గోమాస శ్రీనివాస్, చల్లా నారాయణరెడ్డి, విశ్వేశ్వర్, సూర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

50
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS