జంపన్నవాగుపై చెక్ డ్యాం నిర్మించాలి


Wed,January 11, 2017 02:07 AM

ఏటూరునాగారం, జనవరి 10 : జీవనదిగా ప్రవహిస్తున్న జంపన్నవాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి, ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి, గొలుసుకట్టు చెరువులకు సాగునీటిని పంపింగ్ చేయాలని టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు చిటమట రఘు ప్రభుత్వాన్ని కోరారు. మండలకేంద్రంలో మంగళవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా జంపన్నవాగుపై చెక్‌డ్యాంలను నిర్మించడం లేదని ఆరోపించారు. చెక్ డ్యాం నిర్మిస్తే ఏటూరునాగారం, బూటారం, ఎక్కెల, ఆకులవారి ఘనపూర్‌కు చెందిన రైతులు బోర్లు వేసుకుని నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు.

తాళ్లగడ్డలోని పెద్ద చెరువులోకి నీటిని పంపింగ్ చేసేందుకు 1989లో వాగుపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం చుక్క నీటిని కూడా అందించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా చెక్‌డ్యాం నిర్మించి, ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే ఎక్కెల, దయ్యంకుంట, మేడారం చెరువు, ఎర్ర చెరువు, పెద్ద చెరువు, రసూల్ కుంట, గణేష్‌కుంట, జిన్నామ కుంటలోకి నీటిని చేర్చవచ్చని తెలిపారు. సమావేశంలో మండల నాయకులు ఖళీల్ ఖాన్, తిప్పనపల్లి సుదర్శన్, పెద్దబోయిన నర్సింగరావు, గంజిస్వామి, బట్టు రమేశ్, వీరస్వామి, బాస రాములు తదితరులు పాల్గొన్నారు.

120
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS