డొంక కదులుతోంది..!


Wed,January 11, 2017 02:05 AM


మల్హర్, జనవరి10 : నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన ఘటనలో తొవ్వినా కొద్ది డొంక కదులుతోంది. మండలంలోని కొయ్యూరు, తాడిచెర్ల గ్రామీణ బ్యాంకుల్లో నకిలీ పాస్‌పుస్తకాలపై రుణాలు పొందారనే ఆరోపణలపై కొన్ని రోజుల నుంచి తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో 50 వరకు నకిలీ పాస్‌పుస్తకాలు బయటపడ్డాయి. ఇందులో అధిక శాతం తాడిచెర్ల గ్రామానికి చెందినవే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ పాస్‌బుక్కులు కలిగిన వ్యక్తులను, వారి భూములను నేరుగా విచారించడానికి తాడిచెర్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి ఒక అధికారిని నియమించారు. ఆ అధికారి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విచారణను వేగవంతం చేశారు. అక్రమ రుణగ్రస్తుల నుంచి డబ్బులు రికవరీ చేసి, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఏకంగా జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్థానిక తహసీల్దార్ రాజమౌళికి ఆదేశాలు అందినట్లు సమాచారం.

అయితే, ఓ రాజకీయ నాయకుడు ఈ వ్యవహారంలో తలదూర్చి పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి, దర్యాప్తును నిలిపివేయాలని కోరినట్లు తెలిసింది. కాగా, ఈ అక్రమ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది హస్తం కూడా ఉండి ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమంగా రుణాలు పొందిన వ్యక్తులతోపాటు వారికి సహకరించిన అధికారులను శిక్షించాలని, ఇక ముందు రుణాల మంజూరు వ్యవహారంలో జాగ్రత్తలు పాటించి, నిజమైన రైతులు రుణాలు పొందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

86
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS