పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి

Wed,January 11, 2017 02:05 AM

తాడ్వాయి, జనవరి 10 : వచ్చే నెల 8 నుంచి 11 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మల మినీ జాతరలో మెరుగైన పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని తహసీల్దార్ పొదెం లక్ష్మయ్య సిబ్బందికి సూచించారు. మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం జరిగిన గ్రామసభకు తహసీల్దార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం లాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర సందర్భంగా శానిటేషన్ క్యాంపు ఏర్పాటు చేయాలనే సర్పంచ్ గడ్డం సంధ్యారాణి అభ్యర్థన మేరకు 10 గుంటల రెవెన్యూ స్థలాన్ని కార్యదర్శి సుభానోద్దీన్‌కు అప్పగించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...