నేడు జిల్లాకు స్పీకర్, ముగ్గురు మంత్రులు


Wed,January 11, 2017 02:05 AM


జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదనాచారితో పాటు రాష్ట్ర మంత్రులు ముగ్గురు జిల్లాకు రానున్నారు. స్పీకర్ మధుసూదనచారి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనుండగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందులాల్ ములుగు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్పీకర్ ఉదయం నేరుగా మొగుళ్లపల్లికి చేరుకుని బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే మోడల్ స్కూల్‌తోపాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.

తర్వాత చిట్యాల మండలం పెడల్‌పేట గ్రామంతోపాటు భూపాలపల్లి మండలం కొత్తపల్లి, గణపురం మండలకేంద్రం, బస్వరాజుపల్లి గ్రామాల్లో వంతెన పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, మంత్రి జూపల్లి కృష్ణారావు ఉదయం రేగొండ మండలంలోని రామన్నగూడెం, బాగిర్ధి పేట గ్రామాలను సందర్శించి, గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం భూపాలపల్లిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సెర్ప్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం జిల్లా మహిళా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామైక్య సంఘాల అధ్యక్షులతో బేటి అనంతరం గణపురం మండలం ధర్మరావుపేట వద్ద హైలెవల్ వంతెన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు.

అలాగే, మంత్రులు జగదీష్‌రెడ్డి, చందులాల్ ఉదయం గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో పర్యటించిన తర్వాత ములుగు మండలం పందికుంట గ్రామంలో జరిగే 33/కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే, నవిష్యతండా, రామకృష్ణాపురం, శివతండాల్లో జరిగే సీసీ రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపనలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

71
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS